మాస్ హీరో రవితేజ తన 66వ చిత్రాన్ని గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఠాగూర్ మధు నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రవి తేజ మరో మారు పోలీస్ గా కనిపించనున్నాడు. హీరోయిన్ గా శృతి హసన్ ని ఎంపిక చేసినట్లు ఇప్పటికే ప్రకటించారు. రవితేజ, శృతి హాసన్, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో గతంలో వచ్చిన బలుపు హిట్ మూవీగా నిలిచింది. దీనితో తాజా చిత్రంపై అంచనాలు బాగానే ఉన్నాయి. కాగా ఈ మూవీలో మరో హీరోయిన్ కూడా నటిస్తుండగా ఆమె ఎవరో రేపు ఉదయం 10:45 కి ప్రకటిస్తారట.
ప్రస్తుతం వి ఐ ఆనంద్ దర్శకత్వంలో రవి తేజ చేస్తున్న డిస్కో రాజా మూవీ నిర్మాణం చివరి దశకు చేరుకుంది. సైన్స్ ఫిక్షన్ మూవీ గా డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ చిత్రంలో నభా నటేష్, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్ గా నటిస్తుండగా ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. డిస్కో రాజా మూవీని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.


