ప్రభాస్, యాష్ ల తరువాత సౌత్ నుండి అతడే…!

Published on Nov 18, 2019 3:19 pm IST

తలపతి విజయ్ మరో రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు. సౌత్ ఇండియా నుండి కేవలం ఇండియా పరిధిలో 200కోట్ల వసూళ్లు సాధించిన హీరోగా రికార్డులకెక్కాడు. ఆయన లేటెస్ట్ మూవీ బిగిల్ తెలుగు, తమిళ భాషలలో కలిపి ఇండియా వరకు 200కోట్లు సాధించింది. ఈ ఫీట్ సాధించిన మొట్టమొదటి హీరో రజిని కాంత్ కాగా తరువాత బాహుబలి చిత్రంతో ప్రభాస్ సాధించారు. ఇక కన్నడ పరిశ్రమలో కేజీఎఫ్ సినిమాతో యాష్ ఓవర్సీస్ వసూళ్లను మినహాయించి ఇండియా వరకు 200 కోట్ల వసూళ్లు సాధించిన హీరోగా నిలిచారు.

ఈ ఫీట్ ఎక్కువ సార్లు సాధించిన హీరోలుగా ప్రభాస్,రజిని ఉన్నారు. బిగిల్ మూవీతో విజయ్ ఈ క్లబ్ లో వచ్చిచేరారు. దీపావళి కానుకగా గత నెల25న విడుదలైన బిగిల్ మూవీ ఇప్పటికీ ఓ మోస్తరు వసూళ్లతో నడుస్తుంది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు. నయనతార విజయ్ కి జంటగా నటించింది. ఇక విజయ్ తన తదుపరి చిత్రం దర్శకుడు లోకేష్ కనకరాజ్ తో చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More