ఫ్యాన్స్ కి మహేష్ మరో విజ్ఞప్తి.

Published on Aug 8, 2020 6:00 pm IST

నేటి ఉదయం మహేష్ ఫ్యాన్స్ కి ఓ విన్నపం చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎవరూ తన పుట్టిన రోజు వేడుకల కోసం గుంపులుగా చేరవద్దని చెప్పారు. కరోనా విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఫ్యాన్స్ ని కోరారు. అలాగే మరో విన్నపం మహేష్ చేయడం జరిగింది. ప్లాస్మా డొనేషన్ చేసేందుకు ముందుకువచ్చిన వారందరిని అభినందించిన మహేష్ తన పుట్టిన రోజున అభిమానులంతా ప్లాస్మా డొనేషన్ పై అవగాహన కల్పించే కార్యక్రమాలు చేయాలని, అవకాశం ఉన్నవారు ప్లాస్మా దానం చెయ్యాలని విజ్ఞప్తి చేశారు. కరోనా నుంచి కోల్కొన్నవారు ప్లాస్మా డొనేట్ చేయడం ద్వారా మరికొంతమంది ప్రాణాలు కాపాడినవారవుతారు, ప్లాస్మా దానం చేయండి తోటివారి ప్రాణాలు నిలబెట్టండి అని మహేష్ ఫ్యాన్స్ కి పిలుపునిచ్చారు.

మహేష్ చేస్తున్న ఈ సామాజిక కార్యక్రమానికి సర్వత్రా ప్రశంశలు అందుతున్నాయి. ఇక మహేష్ పుట్టిన రోజు కానుకగా ఆయన లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట మూవీ నుండి రేపు స్పెషల్ సర్ప్రైజ్ రానుంది. ఆ మూవీ నుండి టైటిల్ ట్రాక్ మరియు మహేష్ వాయిస్ ఓవర్ తో కూడిన ఆడియో రానుందని సమాచారం అందుతుంది. దీని కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచుస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More