సాహో కి సమయం కుదిరింది, టాకే తరువాయి.

Published on Aug 30, 2019 10:13 am IST

భారీ అంచనాల మధ్య విడువులైన సాహో టాక్ ఏమిటనేది కాసేపట్లో తెలియనుంది. విడుదల పరంగా సాహో కి మంచి సమయం కుదిరింది అని చెప్పాలి. ఎందుకంటే నేడు విడుదలైన సాహో చిత్రానికి సోమవారం వినాయక చతుర్థి సెలవు కలుపుకొని మొత్తం నాలుగు రోజుల సుదీర్ఘ వారాంతం లభించినట్లయింది. అలాగే వచ్చే వారం కూడా పెద్ద సినిమాల విడుదల లేదు. వచ్చే వారం అనగా సెప్టెంబర్ 6న ఆది సాయి కుమార్ నటించిన జోడి తో పాటు ఉండిపోరాడే అనే మరో చిన్న చిత్రం విడుదల కానుంది.

సాహోకి ఈ రెండు చిత్రాలు పోటీకాదు కాబట్టి మరో వారం సోలో వీకెండ్ లభించినట్లే లెక్క. కాబట్టి సెప్టెంబర్ 13న గ్యాంగ్ లీడర్ విడుదల అయ్యేవరకు సాహో కి తెలుగులో పోటీ ఇచ్చే సినిమానే లేదు. కాబట్టి సాహో టాక్ ఏమాత్రం పాజిటివ్ గా వచ్చిన వసూళ్ల వర్షం కురవడం ఖాయం అని ట్రేడ్ పండితుల వాదన.

సంబంధిత సమాచారం :