శ్రీ విష్ణు తాజాగా నటిస్తోన్న సినిమా ‘నీది నాది ఒకే కథ’. వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో సట్నా టైటస్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ కు మంచి స్పందన లభించింది. ఈ మూవీ యొక్క ప్రమోషనల్ సాంగ్ ‘ఏందిరా ఈ జనాల గోల’ను రేపు ఉదయం 9 గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు.
చదువు పై ఆసక్తి లేని వాడిని చదువుకోమని చెప్పేకంటే, వాడికి ఎందులో ఆసక్తి ఉందో తెలుసుకుని ఆ దిశగా వాడి పయనం సాగించినట్లయితే అతను విజయం సాధిస్తాడనే కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు వేణు ఉడుగుల. సురేష్ బొబ్బిలి సంగీతం అందించిన ఈ సినిమాకు నాగేశ్వర రెడ్డి బొంతల ఎడిటర్ గా పనిచేయగా రాజ్ తోట సినిమాటోగ్రఫి అందించారు.


