“RRR” లో తారక్, చరణ్ ల మధ్య హైలైట్ అయ్యే అద్భుతమైన సీన్!

“RRR” లో తారక్, చరణ్ ల మధ్య హైలైట్ అయ్యే అద్భుతమైన సీన్!

Published on Apr 29, 2021 5:37 PM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల కలయికలో దర్శక ధీరుడు రాజమౌళి “రౌద్రం రణం రుధిరం” అనే బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ మల్టీ స్టారర్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఆల్ మోస్ట్ కంప్లీట్ కాబడిన ఈ భారీ చిత్రం కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ భారీ చిత్రంలో ఓ సన్నివేశంపై ఆసక్తికర బజ్ బయటకు వచ్చింది.

దాని ప్రకారం ఈ చిత్రంలో తారక్ మరియు చరణ్ లు చేస్తున్న భీమ్, రామరాజుల పాత్రల నడుమ కారాగారంలో ఓ అద్భుతమైన భావోద్వేగపూరిత సన్నివేశం ఉంటుందట. యాక్షన్ సన్నివేశాలు మినహా ఎమోషనల్ పరంగా ఆ సన్నివేశం అత్యద్భుతంగా ఉంటుందట. అంతే కాకుండా వారిద్దరి మధ్య వచ్చే ఈ సీన్ సినిమాలో మరో ప్రధానాకర్షణగా నిలుస్తుందట. మరి ఆన్ స్క్రీన్ లో ఈ సీన్ ఎలా ఉంటుందో తెలియాలి అంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు