కథపై వన్ ఇయర్ వర్క్ చేశా – రాజమౌళి.

కథపై వన్ ఇయర్ వర్క్ చేశా – రాజమౌళి.

Published on Sep 30, 2014 2:42 PM IST

Bahubali_rajamouli

‘రాజ్యం కోసం, అధికారం కోసం పోటీ పడుతున్న ఇద్దరు అన్నదమ్ముల పోరాట గాధ ‘బాహుబలి’ కథ. మా నాన్న విజయేంద్ర ప్రసాద్ రాసిన ఈ కథను సినిమాకు అనువుగా మలచడానికి, డెవలప్ చేయడానికి నేను ఏడాది సమయం తీసుకున్నాను. సిల్వర్ స్క్రీన్ పై భారి స్థాయిలో ఈ సినిమా తెరకెక్కించాలని నా ప్రయత్నం.’ అని అన్నారు ప్రముఖ దర్శకులు రాజమౌళి.

ప్రభాస్, రానా అన్నదమ్ములుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చారిత్రాత్మక సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. ఫైట్ మాస్టర్ పీటర్ హైయిన్స్ నేతృత్వంలో ప్రత్యేకంగా నిర్మించిన 100 అడుగుల భారి విగ్రహం వద్ద యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ప్రతి రోజు 1000 మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులు, 250 మంది టెక్నీషియన్లు మరియు ఇతర ప్రొడక్షన్ సభ్యులు షూటింగ్ లో పాల్గొంటున్నారు.

అనుష్క, తమన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో సత్యరాజ్, రమ్యకృష్ణ, అడవి శేష్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. యం.యం.కీరవాణి సంగీత దర్శకుడు. ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోబు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు