మజిలీ నుండి ‘వన్ బాయ్-వన్ గర్ల్’ సాంగ్ విడుదల !

Published on Mar 8, 2019 10:34 am IST


యువ సామ్రాట్ నాగ చైతన్య నటిస్తున్న మజిలీ చిత్రం విడుదలకు సిద్దమవుతుంది. దాంతో సినిమా ప్రమోషన్స్ లో జోరు పెంచారు. ఇక తాజాగా ఈ చిత్రంనుండి ‘వన్ బాయ్ -వన్ గర్ల్’ అనే లిరికల్ సాంగ్ ను విడుదలచేశారు. ఈ సాంగ్ నేటి ట్రెండ్ తగ్గుట్లుగా వుంది. ముఖ్యంగా భాస్కర బట్ల రాసిన లిరిక్స్ క్యాచీ గా వున్నాయి. గోపీ సుందర్ ట్యూన్స్ చాలా ఫ్రెష్ గా వున్నాయి. విశ్వ రఘు ఈ సాంగ్ కు కొరియోగ్రఫి అందించారు.

‘నిన్నుకోరి’ ఫేమ్ శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో సమంత , దివ్యంకా కౌశిక్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ పతాకం ఫై సాహు గారపాటి , హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్న ఈచిత్రం ఏప్రిల్ 5న విడుదలకానుంది.

సాంగ్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :

More