బిగ్ బాస్ నుండి ఆముగ్గురిలో ఒకరు అవుట్…!

Published on Aug 28, 2019 6:44 pm IST

ఇక ఈ వారం ఎలిమినేషన్ కొరకు ఎంపికైన హిమజ, మహేష్, పునర్నవి, రవికృష్ణ, రాహుల్, వరుణ్ సందేష్ నుండి ముగ్గురు సేవ్ చేయబడ్డారు.నిన్న జరిగిన ఎపిసోడ్ లో బిగ్ బాస్ నిర్వహించిన సీక్రెట్ టాస్క్ వలన సింగర్ రాహుల్, హీరో వరుణ్ సందేశ్, సీరియల్ నటుడు రవి కృష్ణ లకు ఎలిమినేషన్ నుండి ఉపశమనం లభించింది. నామినేట్ అయిన ఆరుగురు సభ్యులలో ముగ్గురు సేఫ్ జోన్ కి ప్రవేశించడంతో ఈవారం ఎలిమినేషన్ కి గాను కేవలం ముగ్గురే మిగిలారు.

మహేష్ విట్టా, పునర్నవి, హిమజ లలో ఒకరు ఈవారం షో నుండి బయటకి వెళ్లనున్నారు. మరి ఈ ముగ్గురిలో ఈ వారం ప్రేక్షకులు ఎవరిని బిగ్ బాస్ ఇంటి నుండి తమ ఇంటికి పంపిస్తారో చూడాలి. ఇప్పటివరకు జరిగిన ఐదు వారాలకి గాను, హేమ, జాఫర్, తమన్నా, రోహిణి, ఆషురెడ్డి బిగ్ బాస్ షో నుండి ఎలిమినేట్ చేయబడ్డారు.

సంబంధిత సమాచారం :