2020 ఇండియాలో టాప్ 10 సాంగ్స్ లో బన్నీవే రెండు.!

2020 ఇండియాలో టాప్ 10 సాంగ్స్ లో బన్నీవే రెండు.!

Published on Dec 15, 2020 9:00 AM IST

aa 1

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కించిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఎంటెర్టైనర్ “అల వైకుంఠపురములో” అన్ని రకాల ప్లాట్ ఫామ్స్ లో ఎంతటి సెన్సేషన్ ను నమోదు చేసిందో అందరికీ తెలిసిందే. ఇక ఈ 2020 ఏడాది చివర్లో మరో రికార్డుతో బన్నీ ముగించేశాడు. ఈ సినిమా సంగీతం పరంగా కూడా అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

ముఖ్యంగా కొన్ని పాటలు అయితే బిగ్గెస్ట్ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. థమన్ సంగీతం అందించిన ఈ సినిమాలోని “బుట్ట బొమ్మ” అలాగే “రాములో రాముల” పాటలు ఈ ఏడాదికి మొత్తం మన ఇండియాలో టాప్ 10 మ్యూజిక్ వీడియోల జాబితాలో నిలిచాయి. ఇలా చోటు సంపాదించుకొన్న ఏకైక తెలుగు సినిమాగా ఈ చిత్రం అలాగే హీరోగా బన్నీ నిలిచాడు. దీనితో బన్నీ ఖాతాలో ఈ ఏడాది మరో రికార్డు పడ్డట్టు అయ్యింది. ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్శకత్వంలో “పుష్ప” అనే పాన్ ఇండియన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు