ఓన్లీ నేను ట్రైలర్ విడుదల !

ఓన్లీ నేను ట్రైలర్ విడుదల !

Published on Mar 20, 2019 8:00 AM IST

only

పూర్విట‌క్క‌ర్‌, చింగ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో స‌ర్క‌డ‌మ్‌స్టోరీస్ బ్యాన‌ర్ పై స‌ర్క‌డ‌మ్ శ్రీ‌నివాస్ తెరకెక్కిస్తున్న చిత్రం ఓన్లీ నేను. బట్ నాట్ ఎలోన్ అనేదే ఉపశీర్షిక. శేష‌గిరిరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం యొక్క ట్రైల‌ర్‌ను ఫిల్మ్‌ఛాంబ‌ర్‌లో మీడియా స‌మ‌క్షంలో విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా విలేక‌రుల స‌మావేశంలో…

ద‌ర్శ‌కుడు స‌ర్క‌డ‌మ్ శ్రీ‌నివాస్ మాట్లాడుతూ. ఈ చిత్ర క‌థాంశం ప్ర‌పంచం మొత్తంలో టాప్‌టెన్ బిలినియ‌ర్స్‌లో మ‌హిళలు లేక‌పోవ‌డం అనే అంశం పై క‌థ. ఒక అంద‌మైన తెలివైన అమ్మాయికి క‌లిగిన బాధ‌. ఎక్క‌డుంది ఉమెన్ ఎన్‌ప‌వ‌ర్‌మెంట్ అంటూ… నేనెందుకు ఆ స్థానంలో ఉండ‌కూడ‌దు అన్న‌దే ఆ అమ్మాయి గోల్‌. అందులో భాగంగానే త‌న సొంత స్నేహితురాలిని సైతం చంప‌డానికి వెన‌కాడ‌దు. మీరంద‌రూ త‌ప్ప‌కుండా ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నాను అన్నారు.

నిర్మాత శేష‌గిరిరావు మాట్లాడుతూ… నాకు ఈ చిత్రం ద్వారా ఆయ‌న‌తో భాగ‌స్వామ్యం కావ‌డం చాలా సంతోషంగా ఉంది. డిసెంబ‌ర్‌6కి ఈ చిత్రం పూర్త‌వుతుంది. ఈ చిత్రంలో ఎన్నో ట్విస్ట్‌లు ఉంటాయి. క‌థ చాలా కొత్త‌గా ఉంటుంది. మీరంద‌రూ త‌ప్ప‌కుండా ఆద‌రించాలి అన్నారు.

హీరో చింగ్ మాట్లాడుతూ… నేను ఒక లాయ‌ర్‌ని న‌న్ను న‌మ్మి నాకు ఇంత మంచి అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు నా కృత‌జ్ఞ‌త‌లు అన్నారు.

హీరోయిన్ పూర్వి ట‌క్క‌ర్ మాట్లాడుతూ… నేను శ్రీ‌నివాస్‌గారితో క‌లిసి గ‌తంలో చాలా ప్రాజెక్ట్‌లో ప‌ని చేశాను. నాకు ఇంత మంచి అవ‌కాశం ఇచ్చినందుకు ఆయ‌న‌కు నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు. ఈ సినిమా విడుద‌ల కోసం నేను కూడా చాలా ఆత్రుత‌గా ఎదురుచూస్తున్నా అన్నారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు