“అఖండ” నుంచి ఒకటే ఫిక్స్ అయ్యినట్టుంది..!

Published on Jun 9, 2021 7:00 am IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ అండ్ సెన్సేషనల్ ప్రాజెక్ట్ “అఖండ”. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు కూడా నెలకొన్నాయి. అయితే మరి ఇంకొక్క రోజులో బాలయ్య పుట్టినరోజు ఉంది అనగా మేకర్స్ ఎలాంటి అప్డేట్ ఇస్తారా ఎన్ని ఇస్తారా అన్నది ఆసక్తిగా మారగా..

దానికి ఒక్క పోస్టర్ మాత్రమే రానున్నట్లు తెలుస్తుంది. ఆల్రెడీ పోస్టర్ రిలీజ్ కు టైం ఫిక్స్ చేసినా బాలయ్య ఫాన్స్ మాత్రం మరో మాస్ టీజర్ కట్ కోసం కూడా ఎదురు చూస్తున్నారు. అయితే ఫస్ట్ సింగిల్ కోసం కూడా ఎప్పటి నుంచో ఎదురు చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి వీటిపై మాత్రం ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. ఫైనల్ గా మాత్రం పోస్టర్ ఒకటే కన్ఫర్మ్ అయ్యింది. మరి మిగతా వాటిపై ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి..

సంబంధిత సమాచారం :