2వ వారం ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతున్న ‘ఊహలు గుసగుసలాడే’

2వ వారం ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతున్న ‘ఊహలు గుసగుసలాడే’

Published on Jun 30, 2014 2:16 PM IST

oohalu-gusagusalade
చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను మెప్పించి హిట్ టాక్ ని సొంతం చేసుకున్న సినిమా ‘ఊహలు గుసగుసలాడే’. జూన్ 20న రిలీజ్ అయిన ఈ సినిమా విడుదలైన అన్ని ఎరియాల్లోనూ విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. మెయిన్ సిటీల్లో ఈ మూవీ రెండవ వారం కూడా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతోంది.

సెకండ్ వీకెండ్ లో అన్ని మల్టీ ప్లెక్సుల్లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ రాబట్టుకోవడమే కాకుండా మిగతా ఏరియాల్లోనూ కలెక్షన్స్ తగ్గుండా రన్ అవుతుండడం చెప్పుకోదగిన విషయం. తెలుగు ఇండస్ట్రీలోని ప్రముఖులంతా ఈ సినిమాని చూసి మెచ్చుకోవడం మరియు ఎస్ఎస్ రాజమౌళి, నందమూరి బాలకృష్ణ, జూ. ఎన్.టి.ఆర్ లాంటి వాళ్ళు కూడా ప్రత్యేకంగా సినిమా చూసి ప్రశంశించడం సినిమాకి మరింత హెల్ప్ అయ్యింది. ఒక చిన్న సినిమాకి ఇలా ఆదరణ లభించడం టాలీవుడ్ కి చాలా శుభసూచకం.

కమెడియన్ శ్రీనివాస్ అవసరాల దర్శకుడిగా పరిచయమవుతూ చేసిన ఈ సినిమాలో నాగ శౌర్య, రాశి ఖన్నా జంటగా నటించారు. ‘ఈగ’, ‘అందాల రాక్షసి’, ‘లెజెండ్’ లాంటి సూపర్ హిట్ సినిమాలను అందించిన సాయి కొర్రపాటి ఈ సినిమాని నిర్మించగా కళ్యాణి కోడూరి సంగీతం అందించాడు.

తాజా వార్తలు