‘ఊరంతా అనుకుంటున్నారు’… టీజర్ బాగుందని.. !

‘ఊరంతా అనుకుంటున్నారు’… టీజర్ బాగుందని.. !

Published on Apr 7, 2019 7:45 PM IST

నవీన్ విజయకృష్ణ, అవసరాల శ్రీనివాస్ హీరోలుగా మేఘ చౌదరి, సోఫియా సొన్గ్ హీరోయిన్స్ గా బాలాజీ సనాల దర్శకత్వంలో రౌఆస్కిర్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై శ్రీహరి మంగళంపల్లి, రమ్య గోగుల, పి.ఎల్.యెన్. రెడ్డి, ఎ. పద్మనాభ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఊరంతా అనుకుంటున్నారు’. ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకొని రిలీజ్ కి రెడీ అవుతోంది.

కాగా ఈ చిత్రం టీజర్ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో చిత్ర యూనిట్ సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, హిట్ చిత్రాల దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఇంద్రగంటి మోహనకృష్ణ మాట్లాడుతూ.. నవీన్ నాకు గత పదేళ్లుగా తెల్సు. వెరీ బ్రిలియంట్ ఎడిటర్ తను. ఈ పోస్టర్ చూడగానే నాకు అష్టాచెమ్మా గుర్తుకువచ్చింది. గ్రామీణ నేపథ్యంలో ఆ పల్లె వాసన, బంధాలు బంధుత్వాలు నేపథ్యంలో వచ్చిన సినిమాలు అన్నీ బాగా ఆడాయి. ఈ సినిమా కూడా బాగుంటుందని టీజర్ చూడగానే అర్ధం అయింది. ఇలాంటి మంచి సినిమా తీసిన టీమ్ అందరికీ అభినందనలు అని తెలిపారు.

హీరో నవీన్ విజయకృష్ణ మాట్లాడుతూ.. సంవత్సరం కాలంగా ఈ సినిమా చేస్తున్నాం. అందరం కలిసి ఫ్యామిలీ లా కలిసి వర్క్ చేసాం. అవుట్ ఫుట్ బాగా వచ్చింది. ఇదొక ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ. అందర్నీ అలరిస్తుంది. కథ విన్నప్పుడే చాలా బాగా నచ్చింది. బాలాజీ బాగా తెరకెక్కించాడు. నిర్మాతలు మంచి క్వాలిటీతో ఈ సినిమా రూపొందించారు.. అన్నారు.

దర్శకుడు బాలాజీ సనాల మాట్లాడుతూ.. ఫస్ట్ ఈ లైన్ రమ్య గారు చెప్పారు. అప్పటినుండి ఈ కథ పై వర్క్ చేస్తూ వచ్చాం. సినిమా అవుట్ ఫుట్ చూసి కాన్ఫిడెంట్ గా వున్నాం. నవీన్, అవసరాల శ్రీనివాస్ ఇద్దరూ బాగా కోపరేట్ చేసారు. నటీ నటులులందరూ తమ పాత్రలకి ప్రాణం పోశారు. బాబు కెమెరా వర్క్, రాధాకృష్ణ మ్యూజిక్ సినిమాకి ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి.. అన్నారు. నిర్మాత శ్రీహరి మంగళంపల్లి మాట్లాడుతూ.. ఒక మంచి సినిమాని నిర్మించే అవకాశం ఇచ్చిన ఇండస్ట్రీకి నా ధన్యవాడాలు. కోనసీమ నేపథ్యంలో ఈ సినిమా చేశాం. పోస్టర్స్, టీజర్ కి మంచి బజ్ వచ్చింది. ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు