ఊరంతా అనుకుంటున్నారు టీజర్ విడుదల !

Published on Apr 7, 2019 2:25 pm IST

ప్రముఖ నటుడు నరేష్ వీకే తనయుడు నవీన విజయకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘ఊరంతా అనుకుంటున్నారు’. బాలాజీ సానల తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మేఘా చౌదరి కథానాయికగా నటిస్తుండగా, సోఫియా సింగ్ , శ్రీనివాస్ అవసరాల , రావు రమేష్, జయసుధ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రం యొక్క టీజర్ ఈ రోజు విడుదలైయింది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కెఎమ్ రాధాకృష్ణ సంగీతం అందిస్తున్నారు.

శ్రీహరి మంగళంపల్లి , రమ్య గోగుల , పీఎల్ఎన్ రెడ్డి , పద్మనాభ రెడ్డి, సంయుక్తంగా నిర్మస్తున్న ఈ చిత్రం తర్వలోనే ప్రేక్షకులముందుకు రానుంది.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :