అంచనాలు పెంచేసిన ఆపరేషన్ గోల్డ్ ఫిష్ టీజర్ !

Published on Mar 4, 2019 2:46 pm IST


యంగ్ హీరో ఆది ,ఎయిర్ టెల్ యాడ్ ఫేమ్ సాషా చెత్రీ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ఆపరేషన్ గోల్డ్ ఫిష్. కేరింత ఫేమ్ సాయి కిరణ్ అడివి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నిత్య శెట్టి , రావు రమేష్ , కృష్ణుడు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రం యొక్క టీజర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు ఈరోజు లాంచ్ చేశారు. ఈ టీజర్ ఇంట్రస్టింగ్ గా ఉండి సినిమా ఫై అంచనాలను పెంచింది.

టెర్రరిజం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆది ఎన్ ఎస్ జి కమాండర్ గా నటిస్తున్నాడు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ప్రతిభ పట్టాభి , కట్టా ఆశిష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

టీజర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :