ఇండియాలో 2 భాషల్లో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “ఓపెన్ హైమర్”..

ఇండియాలో 2 భాషల్లో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “ఓపెన్ హైమర్”..

Published on Mar 21, 2024 12:07 PM IST

ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ (Oscars) అవార్డు వేడుకలు గత వారమే యూఎస్ లో అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. మరి ఈ వేడుకల్లో హాలీవుడ్ హిట్ చిత్రం “ఓపెన్ హైమర్” (Oppenheimer) ఏకంగా 7 అవార్డ్స్ ని గెలుచుకుంది. నటుడు కిలియన్ మర్ఫీ (Cillian Murphy) హీరోగా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ (Christopher Nolan) తెరకెక్కించగా ఇద్దరూ కూడా ఈ చిత్రానికి తమ మొట్ట మొదటి ఆస్కార్ అవార్డులని గెలుచుకున్నారు.

దీనితో అక్కడ నుంచి మరోసారి “ఓపెన్ హైమర్” పేరు మరోసారి ప్రపంచ వ్యాప్తంగా మారుమోగింది. మరి థియేట్రికల్ రిలీజ్ తర్వాత గ్లోబల్ గా ఈ చిత్రం ఓటిటి రిలీజ్ కి వచ్చింది. అలాగే ప్రైమ్ వీడియో లాంటి సంస్థలు కూడా తీసుకొచ్చాయి కానీ వాటికి ఆల్రెడీ సబ్ స్క్రిప్షన్ ఉన్నప్పటికీ మళ్ళీ రెంటల్ లో చూడాల్సి ఉంది. అయితే ఇపుడు ఫైనల్ గా ఓపెన్ హైమర్ నార్మల్ స్ట్రీమింగ్ (Oppenheimer OTT) కి వచ్చేసింది.

ఈ సినిమాని ప్రముఖ సంస్థ జియో సినిమా సొంతం చేసుకోగా అందులో ఈ చిత్రం రోజు నుంచి ఇంగ్లీష్, హిందీ రెండు భాషల్లో అందుబాటులోకి వచ్చేసింది. మరి జియో సినిమా సబ్ స్క్రైబర్స్ అయితే ఇప్పుడు ఎలాంటి రెంటల్ లేకుండా ఈ చిత్రాన్ని చూడవచ్చు. మరి ఈ సినిమాలో ప్రముఖ నటుడు రాబర్ట్ డౌనీ జూనియర్ కూడా నటించగా తాను ఈ చిత్రంతోనే మొట్ట మొదటి ఆస్కార్ అవార్డుని గెలుచుకున్నారు. అలాగే నోలన్ అతి త్వరలోనే మరోసారి ఓపెన్ హైమర్ చిత్రాన్ని 1000 కి పైగా థియేటర్స్ లో రీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు