ఆస్కార్ విన్నర్స్ తో “నా సామిరంగ” సందడి.!

Na Samiranga

ప్రస్తుతం మన టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా దర్శకుడు విజయ్ బిన్నీ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న సాలిడ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “నా సామిరంగ” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా తెరకెక్కిస్తున్నారు. మరి ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ కూడా మంచి ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు.

ఇక నాగ్ కెరీర్ లో 99వ సినిమాగా ఇది రాబోతుండగా చిత్రం నుంచి అయితే లేటెస్ట్ గా ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని సాహిత్య రచయిత ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ అందించారు. తాను అలాగే సంగీత దర్శకుడు ఆస్కార్ విన్నర్ ఎం ఎం కీరవాణి ల కలిసి నాగ్ తో కలిసి ఉన్న పిక్ ని షేర్ చేసి తాము ఇప్పుడు పాటల సందడిలో బిజీగా ఉన్నట్టుగా ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించారు.

ఇక ఈ సినిమా ఆల్బమ్ ఏ లెవెల్లో ఉంటుందో చూడాలి. మరి ఈ చిత్రం అన్ని పనులు కంప్లీట్ చేసుకొని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా అయితే విడుదల ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version