2021 ‘ఆస్కార్’ విజేతల వివరాలు !

2021 ‘ఆస్కార్’ విజేతల వివరాలు !

Published on Apr 26, 2021 12:30 PM IST

సినిమా ఇండస్ట్రీలో ఆస్కార్ అవార్డ్ అందుకోవాలని, కనీసం ఆస్కార్ కోసం పోటీపడాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. ఆస్కార్ అంత అత్యంత ప్రతిష్ఠాత్మకమైనది కాబట్టే… మన ఇండియన్ సినిమాలు కూడా పోటీపడుతూ ఉంటాయి. ఇక ఈ సారి కూడా ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా ప్రారంభమైంది. 93వ అకాడమీ అవార్డుల్లో వివిధ విభాగాల్లో ఎంతోమంది దర్శకులు, నటీనటులు పోటీ పడుతున్నారు. ఐతే ‘నో మ్యాడ్‌లాండ్‌’ చిత్రానికి గానూ ఉత్తమ దర్శకురాలిగా క్లోవీ చావ్‌ను ఆస్కార్‌ వరించింది.

విజేతల వివరాలు ఈ కింద విధంగా ఉన్నాయి.

ఉత్తమ దర్శకురాలిగా అవార్డు గెలుపొందిన క్లోవీ చావ్‌

ఉత్తమ చిత్రం: నోమ్యాడ్‌ ల్యాండ్‌

ఉత్తమ దర్శకురాలు: క్లోవీ చావ్‌ (నోమ్యాడ్‌ ల్యాండ్‌)

ఉత్తమ సహాయ నటుడు: డానియెల్‌ కలువోయా (జుడాస్‌ అండ్‌ ది బ్లాక్ మిస్సయా)

ఉత్తమ సహాయ నటి: యున్‌ యా జంగ్‌ (మినారి)

ఉత్తమ సౌండ్‌: సౌండ్‌ ఆఫ్‌ మెటల్‌

ఉత్తమ సినిమాటోగ్రఫి: ఎరిక్‌ (మ్యాంక్‌)

(ఉత్తమ సహాయ నటిగా ఆస్కార్‌ అందుకున్న యున్‌ యా జంగ్‌)

ఉత్తమ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే: ఎమరాల్డ్‌ ఫెన్నెల్ (ప్రామిసింగ్‌ యంగ్‌ ఉమెన్‌)

ఉత్తమ అడాప్టెడ్‌ స్క్రీన్ప్లే : క్రిస్టోఫర్‌ హామ్టన్‌, ఫ్లొరియన్‌ జెల్లర్‌ (ది ఫాదర్‌)

ఉత్తమ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌: అనదర్‌ రౌండ్‌ (డెన్మార్క్‌)

ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్‌ సబ్జెక్ట్‌: అంథోనీ (కలెక్టివ్‌)

ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్‌: పిపా, జేమ్స్‌ రీడ్‌, క్రేగ్‌ ఫాస్టర్‌ (మై ఆక్టోపస్‌ టీచర్‌)

ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌: ఆండ్రూ జాక్సన్‌, డేవిడ్‌ లీ (టెనెట్‌)

ఉత్తమ ప్రొడెక్షన్‌ డిజైన్‌: డోనాల్డ్‌ బర్ట్‌ (మ్యాంక్‌)

ఉత్తమ మేకప్‌ అండ్‌ హెయిర్‌ స్టైలింగ్‌: సెర్హియోలోఫెజ్‌, మియానీల్‌, జమికా విల్సన్‌ (మా రైనీస్‌ బ్లాక్‌ బాటమ్‌)

ఉత్తమ క్యాస్టూమ్‌ డిజైన్‌: అన్‌రాత్‌ (మా రైనీస్‌ బ్లాక్‌ బాటమ్)

ఉత్తమ లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిల్మ్‌: మార్టిన్‌ డెస్మండ్‌ రాయ్‌ (టూ డిస్టెంట్ స్ట్రేంజర్స్)

ఉత్తమ యానిమేటెడ్‌ షార్ట్‌ ఫిల్మ్‌: మైకల్‌ గ్రోవియర్‌ (ఇఫ్‌ ఎనిథింగ్‌ హ్యాపెన్స్‌ ఐ లవ్‌ యూ)

ఉత్తమ యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిల్మ్‌: పీట్‌ డాక్టర్‌, దానా మరీ (సోల్‌)

సంబంధిత సమాచారం

తాజా వార్తలు