బిగ్‌ స్క్రీన్‌ లోని మ్యాజికే వేరు – రకుల్

Published on Jun 28, 2021 10:00 am IST

డిజిటల్‌విప్లవం తరువాత సినిమా చూసే విధానం మారిపోయింది. ముఖ్యంగా ఎంటర్‌టైన్‌ స్పేస్‌ లో ఓటీటీ ప్లాట్‌ ఫామ్స్‌ లీడింగ్ పొజిషన్ కి వచ్చేశాయి. అయితే ఈ ఓటీటీల వల్ల నటీనటులకు, దర్శకులకు అవకాశాలు పెరుగుతున్నాయని చెబుతుంది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. రకుల్‌ మాటల్లోనే ‘కోవిడ్‌ కారణంగా థియేటర్స్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌ అందుబాటులో లేదు. దాంతో ఓటీటీ ప్లాట్‌ ఫామ్స్‌ లోని కంటెంట్‌ వైపు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు.

ఓటీటీ ప్లాట్‌ ఫామ్స్‌ లోని మన సినిమాలను ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు చూస్తూ మంచి కంటెంట్‌ను ప్రశంసిస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది. పెద్ద తెరపై సినిమాలను చూసి ఫుల్‌గా ఎంజాయ్‌ చేసే ప్రేక్షకులు ఎలా ఉన్నారో, ఇప్పుడు ఓటీటీ కంటెంట్‌ ను ఇష్టపడే ప్రేక్షకులు అలాగే ఆంతే ఆసక్తితో ఉన్నారు. అయితే ఎంటర్‌ టైన్‌మెంట్‌ ప్లాట్‌ ఫామ్స్‌ ఎన్ని వచ్చినా బిగ్‌ స్క్రీన్‌ పై సినిమా చూస్తే వచ్చే మ్యాజిక్‌ వేరు’ అంటూ చెప్పుకొచ్చింది రకుల్.

సంబంధిత సమాచారం :