ఓటీటీ అప్‌డేట్: ప్రైమ్ వీడియోలోకి వచ్చిన ‘నౌ యూ సీ మీ’ త్రీక్వెల్.. కానీ!

ఓటీటీ అప్‌డేట్: ప్రైమ్ వీడియోలోకి వచ్చిన ‘నౌ యూ సీ మీ’ త్రీక్వెల్.. కానీ!

Published on Jan 1, 2026 10:19 AM IST

Now You See Me 3 OTT

ప్రముఖ హాలీవుడ్ మ్యాజిక్-హీస్ట్ ఫ్రాంచైజీ ‘నౌ యూ సీ మీ’ నుండి వచ్చిన లేటెస్ట్ మూవీ ‘నౌ యూ సీ మీ: నౌ యూ డోంట్’. రూబెన్ ఫ్లెషర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చేసింది.

ఈ సినిమాలో జెస్సీ ఐసెన్‌బర్గ్, వుడీ హారెల్సన్, డేవ్ ఫ్రాంకో మరియు ఇస్లా ఫిషర్ ప్రధాన పాత్రల్లో నటించగా, రోజామండ్ పైక్ కీలక పాత్రలో కనిపించారు. అయితే, ఈ సినిమా డిజిటల్ రిలీజ్ విషయంలో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఈ చిత్రం ప్రస్తుతం కేవలం రెంటల్ (Rental) పద్ధతిలో మాత్రమే అందుబాటులో ఉంది. అంటే, ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఉన్నప్పటికీ, ఈ సినిమా చూడాలంటే అదనంగా రూ. 499 చెల్లించాల్సి ఉంటుంది.

మునుపటి భాగాలతో పోలిస్తే ఈ థర్డ్ పార్ట్ ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. కథలో కొత్తదనం పెద్దగా లేకపోవడం, కేవలం పాత పంథాలోనే సాగడంతో బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ యావరేజ్ రిజల్ట్‌తో సరిపెట్టుకుంది. ఇక భాష విషయానికి వస్తే, ప్రస్తుతం ఇది కేవలం ఇంగ్లీష్‌లోనే అందుబాటులో ఉంది. బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమా యావరేజ్ వసూళ్లనే సాధించింది. మరి ఈ భారీ రెంటల్ ధర చెల్లించి, మన తెలుగు సినిమా ప్రియులు ఈ హాలీవుడ్ మ్యాజిక్ మూవీని ఎంతవరకు ఆదరిస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు