‘పెద్ది’ ఓటీటీ పార్ట్నర్ లాక్.. దిగ్గజ సంస్థకి భారీ సినిమా హక్కులు!

‘పెద్ది’ ఓటీటీ పార్ట్నర్ లాక్.. దిగ్గజ సంస్థకి భారీ సినిమా హక్కులు!

Published on Jan 16, 2026 4:05 PM IST

Peddi

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా కలయికలో చేస్తున్న భారీ చిత్రమే “పెద్ది”(Peddi). పాన్ ఇండియా లెవెల్లో మంచి అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంటుంది. మరి ఈ సినిమాపై ఇప్పుడు బిగ్ అప్డేట్ బయటకి వచ్చింది. ఈ సినిమా తాలూకా పాన్ ఇండియా భాషల్లో హక్కులు దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్టు కన్ఫర్మ్ చేశారు.

సో థియేటర్స్ రిలీజ్ తర్వాత ఈ సినిమా పాన్ ఇండియా భాషల్లో అందుబాటులో ఉండనుంది. మరి ఈ సినిమాని ఎంతకి సొంతం చేసుకున్నారు అనే ఇతర డీటెయిల్స్ బయటకి రావాల్సి ఉన్నాయి. ఇక ఈ భారీ సినిమాకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు అలాగే వృద్ధి సినిమాస్ నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ మార్చ్ 27న గ్రాండ్ గా రిలీజ్ కి రానుంది.

తాజా వార్తలు