ఓటిటి సమీక్ష : అసుర్ 2 – జియో సినిమాలో హిందీ వెబ్ సిరీస్

ఓటిటి సమీక్ష : అసుర్ 2 – జియో సినిమాలో హిందీ వెబ్ సిరీస్

Published on Jun 8, 2023 3:01 AM IST
asur Movie Review In Telugu

విడుదల తేదీ : జూన్ 03, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

నటీనటులు: అర్షద్ వార్సీ, బరున్ సోబ్తి, అనుప్రియ గోయెంకా, రిధి డోగ్రా, అభిషేక్ చౌహాన్, మెయాంగ్ చాంగ్, అమీ వాఘ్, పవన్ చోప్రా, గౌరవ్ అరోరా, వేసేష్ బన్సాల్, అదితి KS, అథర్వ విశ్వకర్మ తదితరులు

దర్శకులు : ఓని సేన్

నిర్మాతలు: సెజల్ షా, భవేష్ మండలియా, గౌరవ్ శుక్లా

సంగీత దర్శకులు: ధర్మరాజ్ భట్

సినిమాటోగ్రఫీ: రామానుజ్ దత్తా

ఎడిటర్: చారు టక్కర్

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

అర్షద్ వార్సీ మరియు బరున్ సోబ్తి ప్రధాన పాత్రల్లో నటించిన తాజా వెబ్ సిరీస్ అసుర్ 2. పలువురు విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ సిరీస్ క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కింది. ఇక అసుర్ సీజన్ 1 వాస్తవానికి వూట్ ఓటిటి మాధ్యమంలో లో ప్రసారమైంది. సీజన్ 1 విడుదలైన మూడు సంవత్సరాల తర్వాత, తాజాగా అసుర్ 2 ఇప్పుడు జియో సినిమాలో ప్రసారం చేయడం జరిగింది. మరి సెకండ్ సీజన్ ఆ అంచనాలను అందుకుందా లేదా అనేది ఇప్పుడు దీని యొక్క సమీక్ష లో చూద్దాం.

 

కథ :

 

సిబిఐ నుండి సస్పెండ్ అయిన తర్వాత, డీజే, ఆకా ధనంజయ్ రాజ్‌పూత్ (అర్షద్ వార్సీ) ఒక మఠంలో తన జీవితాన్ని గడుపుతుంటాడు. నిఖిల్ నాయర్ (బరున్ సోబ్తి) తన కూతురు రియా జీవితాన్ని త్యాగం చేసిన తర్వాత డిప్రెషన్‌లోకి వెళ్తాడు. అందుకే అతని భార్య నైనా నాయర్ (అనుప్రియ గోయెంకా) అతని నుండి విడాకులు కోరుతుంది. ఈ తరుణంలో శుభ్ జోషి (అభిషేక్ చౌహాన్) ఒకేసారి ముగ్గురిని చంపడం ద్వారా సిబిఐ కి పెద్ద షాక్ ఇస్తాడు. అయితే శుభ్ ఎప్పటిలాగే వారికి ముందస్తు సమాచారం ఇచ్చినప్పటికీ సిబిఐ దానిని ఆపలేకపోతుంది. అనంతరం డీజే మళ్లీ కేసుపై పని చేయడం ప్రారంభిస్తాడు. కానీ ఆ వెంటనే పాల్ (మీయాంగ్ చాంగ్) నేతృత్వంలోని ఏటీఎఫ్ (యాంటీ టెర్రర్ ఫోర్స్) సిబిఐ నుండి కేసును స్వాధీనం చేసుకుని దర్యాప్తును ప్రారంభిస్తుంది. కాగా తాను పెద్ద దాడికి ప్లాన్ చేస్తున్నానని శుభ్ ఏటీఎఫ్ కి తెలియజేస్తాడు. అయితే మరి ఏటీఎఫ్ శుభ్‌ను గుర్తించగలిగిందా? ఆ పెద్ద దాడిని వారు ఆపారా? చివరకు మరి ఏమైంది? ఇటువంటి వాటికి అన్నిటికీ సమాధానాలు కావలి అంటే అసుర్ 2 వెబ్ సిరీస్ చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

సీజన్ 2 పై ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి మరియు ఎటువంటి సందేహం లేకుండా ఈ సిరీస్ ఆ హైప్‌లకు అనుగుణంగా ముందుకు సాగుతుంది. కథనం చాలా వరకు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. రచన అసాధారణమైనది మరియు ఈ కొత్త సీజన్‌లో సస్పెన్స్‌ని బాగా కొనసాగించారు. శుభ్ పట్టుబడకుండా ఈ హత్యలు ఎలా చేస్తున్నాడనే సన్నివేశాలు చూసి మొదట్లో ఎవరైనా ఆశ్చర్యపోవచ్చు, అయితే చివరికి అందించిన లాజికల్ రీజనింగ్ అన్ని సందేహాలను నివృత్తి చేస్తుంది. శుభ్ జోషి పాత్ర యొక్క గతం కథ ఆకట్టుకుంటుంది మరియు సీజన్ 1 కి సంబంధించి అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇక్కడ లభిస్తాయి. అసుర్ 2 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఎక్కువగా ఉంటుంది మరియు ఏఐ కి సంబంధించిన అన్ని సీక్వెన్స్‌లు ఖచ్చితంగా మన మనస్సులను ఆకర్షిస్తాయి.

ఇక పెద్ద దాడి జరిగే ఎపిసోడ్ అయితే మరింత బాగుంటుంది. రహస్యమైన బాలుడి పాత్ర మంచి రచనకు మరొక ఉదాహరణగా చెప్పాలి. ఎందుకంటే ఇది సిరీస్ పై బాగా ఆసక్తిని పెంచుతుంది. ఏటీఎఫ్ కేసును టేకోవర్ చేయడంతో రిడెండెన్సీ ఫ్యాక్టర్ జాగ్రత్త తీసుకోబడింది. బరున్ సొబ్తి సిబిఐ ఆఫీసర్ గా ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా ఉండే పాత్రలో బాగా నటించారు. అర్షద్ వార్సీ ఫ్రేమ్‌లో కనపడినప్పుడల్లా సీన్స్ లో ఇంటెన్సిటీ పెరుగుతుంది. ఇక ఈ రెండవ సీజన్‌లో అర్షద్ వార్సీ తన పాత్రలో అదరగొట్టే పెర్ఫార్మన్స్ తో ఆడియన్స్ మనసు దోచారు. అనుప్రియ గోయెంకా, రిధి డోగ్రా, అభిషేక్ చౌహాన్, మెయాంగ్ చాంగ్, అమీ వాఘ్, వేషేష్ బన్సాల్ మరియు గౌరవ్ అరోరా తమ తమ పాత్రలలో అద్భుతంగా నటించారు. ఇక అధర్వ విశ్వకర్మ తన పెర్ఫార్మన్స్ మరియు డైలాగ్ డెలివరీతో ఆశ్చర్యపరిచాడు. అద్భుత బాలుడిగా అథర్వ విశ్వకర్మ మాత్రం ఈ సిరీస్ లో అద్భుతం అని చెప్పాలి. ఇక ఈ సిరీస్ ముగింపు దశకు చేరుకునే కొద్దీ ఆడియన్స్ ని మరింత ఆకట్టుకుంటుంది.

 

మైనస్ పాయింట్స్ :

 

సిరీస్ లో సరిగ్గా చూపించని కొన్ని భాగాలు ఉన్నాయి. నుస్రత్ పాత్ర యొక్క కుటుంబ కోణం ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా చూపించాల్సిన ఒక అంశం. నుస్రత్ క్యారెక్టరైజేషన్‌ని తెలియచేయడానికి ఈ సన్నివేశాలు చాలా అవసరం అయినప్పటికీ, అవి ప్రేక్షకులను ఎమోషనల్‌గా కదిలించేంత గొప్పవి అయితే కావు.

అదితి పాత్రలో ఇషాని చాలా బాగా చేసింది, అయితే ఆమె సన్నివేశాలన్నీ ముందుగానే ఊహించవచ్చు. ఇషాని పాత్రకు నెక్స్ట్ ఏమి జరుగుతుందో చాలా స్పష్టంగా మనకు అర్ధం అవుతుంది, ఇది మరింత ఆసక్తికరంగా ఉంటె బాగుండేదనిపిస్తుంది. అయితే ఈ సిరీస్ యొక్క ప్రారంభ ఎపిసోడ్స్‌లో ఎడిటింగ్ ఇంకా మెరుగ్గా చేసి ఉండొచ్చు. వీఎఫ్‌ఎక్స్ వర్క్ తో కూడిన సీన్లు నాసిరకంగా ఉన్నాయి. అలానే సిరీస్ యొక్క ముగింపు కాస్త అసంతృప్తికరంగా ఉంటుంది.

 

సాంకేతిక వర్గం :

 

ధర్మరాజ్ భట్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఎంతో బాగుంది మరియు అతని స్కోర్ కొన్ని సీన్స్ లో అయితే టెన్షన్ క్రియేట్ చేస్తుంది. రామానుజ్ దత్తా కెమెరా పనితనం కూడా బాగుంది. నిర్మాతల నిర్మాణ విలువలు చక్కగా ఉన్నాయి. సిరీస్ యొక్క నిడివిని తగ్గించే అవకాశం ఉంది, ఆ పరంగా ఎడిటింగ్ ఓకే అని చెప్పాలి. ఇక దర్శకుడు ఓని సేన్ విషయానికి వస్తే, అతను సిరీస్‌ కోసం చాలా బాగా కష్టపడ్డారు. అతను పురాణాలను మరియు అధునాతన సాంకేతికతను మిళితం చేసి ఈ క్రైమ్ థ్రిల్లర్‌ని రూపొందించిన విధానం చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా అతని రచనా బృందాన్ని కూడా తప్పక మెచ్చుకోవాలి. డైలాగులు చక్కగా రాసారు, చాలా మంచి ఇంపాక్ట్‌ని క్రియేట్ చేసారు.

 

తీర్పు :

 

మొత్తంగా అసుర్ 2 వెబ్ సిరీస్ మొదటి సీజన్‌కు మించి చాలా వరకు ఆకట్టుకుంటుంది. చక్కని రచన, మెచ్చుకోదగిన సీన్స్ మరియు ఆకట్టుకునే దర్శకత్వ ప్రతిభ దీని బలాలు. మరోవైపు సిరీస్ యొక్క రన్ టైం తక్కువగా ఉంటె బాగుండేది మరియు ముగింపు కొంచెం అసంతృప్తికరంగా ఉంది. మీరు కనుక మొదటి సీజన్‌ని చూసి ఆనందించినట్లయితే, రెండవ సీజన్‌ను కూడా ఇష్టపడతారనే చెప్పాలి. మొత్తంగా మీరు క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ని ఇష్టపడే వారు అయితే ఈ వారం మీ ఫామిలీ తో కలిసి హ్యాపీ గా అసుర్ 2 సిరీస్ ని జియో సినిమాలో చూసేయొచ్చు.

123telugu.com Rating: 3.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు