ఓటిటి రివ్యూ : పాయిజన్ 2 – హిందీ సిరీస్ జీ 5 లో ప్రసారం

నటీనటులు: అఫ్తాబ్ శివదాసాని, లక్ష్మి రాయ్, పూజా చోప్రా, రాహుల్ దేవ్, జైన్ ఇమామ్

దర్శకుడు: విశాల్ పాండ్యా

నిర్మాతలు: సుజన్నా ఘాయ్, హేమంత్ రూప్రెల్, రంజీత్ ఠాకూర్, వినాయక్ జైన్, అమిత్ భార్గవ

సినిమాటోగ్రఫీ : రవి వాలియా

పలు ఆసక్తికర ఓటిటి వెబ్ సిరీస్ ల రివ్యూస్ తో కొనసాగిస్తున్న క్రమంలో నేడు మేము ఎంచుకున్న వెబ్ సిరీస్ “పాయిజన్ 2”. స్ట్రీమింగ్ యాప్ “జీ 5”లో అందుబాటులో ఉన్న ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఇపుడు సమీక్షలో తెలుసుకుందాం రండి.

కథ :

సారా(లక్ష్మి రాయ్), హర్షవర్ధన్(జైన్ ఇమామ్), అలాగే ఆస్కార్(విన్ రానా) లు గోవాలో ఒక రేస్ క్లబ్ ను నడుపుతుంటారు కానీ అది కాస్తా లాసుల్లో నడుస్తుంది. ఇదే సమయంలో ఆస్కార్ వారి ఫండ్స్ ను దుర్వినియోగం చేస్తున్నాడని తెలిసి అతని మిగతా వారు తమ టీం నుంచి తప్పించేస్తారు. ఇక అక్కడ నుంచి వారి క్లబ్ మరింతలా డౌన్ అవుతున్న సమయంలో ఆదిత్య సింగ్ రాథోర్(అఫ్తాబ్ శివదసాని) ఒక క్రేజీ డీల్ తో వారి కంపెనీని సేవ్ చెయ్యడానికి ముందుకు వస్తాడు. దీనితో ఆ డీల్ కు సారా ఓకే అంటుంది కానీ హర్షకు ఇవేమి నచ్చవు. అలాగే మరోపక్క ఆస్కార్ వీటన్నిటి వెనుక ఎవరూ ఉన్నారని భావిస్తాడు. సడెన్ గా వెలుగులోకి వచ్చిన ఈ ఆదిత్య ఎవరు?ఎందుకు అంత ఆఫర్ తో వారి కంపెనీని సేవ్ చెయ్యడానికి ముందుకొస్తాడు? అన్నవే ఈ సిరీస్ అసలు సారాంశం.

ఏమి బాగుంది?

మొదటగా నటీనటులలోని లక్ష్మీ రాయ్ పెర్ఫామెన్స్ విషయానికి వస్తే ఆమె నటన పరంగా తన బెస్ట్ ను ఇచ్చింది అని చెప్పాలి. అలాగే ఒక్క నటనలోనే కాకుండా గ్లామర్ షో విషయంలో కూడా ఎక్కడా రాజీ పడకుండా ఇచ్చిన అవుట్ ఫుట్ హై లెవెల్లో ఉంటుంది. అలాగే అస్మితా సూద్ విషయానికి వస్తే ఈ సిరీస్ కు ఈమె పెర్ఫామెన్స్ కూడా మంచి ప్లస్ అని చెప్పొచ్చు.

అలాగే అఫ్తాబ్ ఈ సిరీస్ లో చేసిన కీ రోల్ మంచి ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. అలాగేనటన పరంగా కూడా తాను మంచి పెర్ఫామెన్స్ ను అందించాడు. ఇక సిరీస్ లోని యాత్ర అంశాల విషయానికి వస్తే నిర్మాణాత్మక విలువలు మంచి స్టాండర్డ్స్ లో ఉంటాయి.

అలాగే అన్ని వర్గాల ప్రేక్షకులకు కూడా కావాల్సిన ఎలిమెంట్స్ ఈ సిరీస్ లో ఉంటాయి. మొదటి సీజన్ తో పోలిస్తే ఈ సీజన్లోని డ్రామా కానీ విజువల్స్ కానీ ఉత్తమంగా అనిపిస్తాయి. ఇక అలాగే ఈ సీజన్లోని డైలాగులు కానీ పంచ్ లైన్స్ కానీ కథనంలో చోటు చేసుకొనే ట్విస్టులు మంచి ఆసక్తికరంగా అనిపిస్తాయి.

ఏమి బాగోలేదు?

ఈ సిరీస్ లో బాగా అబ్జర్వ్ చేస్తే మెయిన్ మైనస్ పాయింట్ ను ఒకటి మనం నోటిస్ చెయ్యొచ్చు. అదే ఎమోషన్స్ అంతలా పండకపోవడం. వాటిని కొన్ని సీన్స్ లో మనం చూడొచ్చు. అలాగే కొంతమంది ఈ కాలంలో ఎలా డబ్బులు కాజేసి అవినీతి చేస్తున్నారు అన్నది మరీ ఎక్కువగా చూపించినట్టు అనిపిస్తుంది.

అలాగే మనం కొన్ని సిరీస్ లు చూస్తున్నపుడు కొన్ని ఎపిసోడ్స్ ను యిట్టె అంచనా వెయ్యొచ్చు అలాంటివి ఇందులో కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఐదు, ఆరు ఎపిసోడ్స్ లో చూడొచ్చు. అలాగే కొన్ని లాజిక్స్ కూడా చాలా చోట్ల మిస్సవుతాయి.

తీర్పు :

ఇక మొత్తంగా చూసుకుంటే ఈ పాయిజన్ 2 ఇంట్రెస్టింగ్ గా సాగే స్టైలిష్ డ్రామాలా అనిపిస్తుంది. ఈ సిరీస్ లో నటీనటుల పెర్ఫామెన్స్ లు అలాగే కథానుసారం వచ్చే ట్విస్టులు, కొన్ని ఎలిమెంట్స్ వంటివి వీక్షణలో ఆసక్తికరంగా ఉంటాయి. కానీ కొన్ని ఎమోషన్స్ లో లోపం అలాగే బాగా మిస్సయిన లాజిక్స్ కాస్త నిరాశ పరుస్తాయి. అయితే కాస్త మసాలా ఎలిమెంట్స్ కానీ కొన్ని మోసపూరిత కంటెంట్ తరహా వగైరా వంటివి ఇష్టపడే వారికి అయితే మంచి ఛాయిస్ గా నిలుస్తుంది.

123telugu.com Rating : 3/5
Reviewed by 123telugu Team

సంబంధిత సమాచారం :

More