ఓటిటి రివ్యూ : “ట్రిపుల్స్” (తెలుగు వెబ్ సిరీస్ డిస్నీప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం)

ఓటిటి రివ్యూ : “ట్రిపుల్స్” (తెలుగు వెబ్ సిరీస్ డిస్నీప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం)

Published on Dec 15, 2020 3:41 PM IST

Triples
తారాగణం: జై, వివేక్ ప్రసన్న, రాజ్‌కుమార్, వాణి భోజన్, నమితా కృష్ణమూర్తి, మాధురి

దర్శకత్వం: చారుకేష్ సేకర్

నిర్మాత: కార్తీక్ సుబ్బరాజ్

ఎడిటర్: జికె. ప్రసన్న

పలు ఆసక్తికర ఓటిటి వెబ్ సిరీస్ లు అలాగే డిజిటల్ గా రిలీజ్ అవుతున్న సినిమాల రివ్యూస్ తో కొనసాగిస్తున్న క్రమంలో మేము లేటెస్ట్ గా ఎంచుకొన్న వెబ్ సిరీస్ “ట్రిపుల్స్”. మరి ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఇపుడు రివ్యూలో తెలుసుకుందాం రండి.

కథ :

తన ఫ్రెండ్స్ తో కలిసి రామ్(జై) ఒక కెఫె ను నడుపుతుంటాడు. అయితే తర్వాత మీరా(వాణి భోజన్)తో ప్రేమలో పడి ఆమెను పెళ్లి చేసుకుంటాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ ఇద్దరూ వేరవ్వాల్సి వస్తుంది. ఇక్కడ నుంచి ఎవరి జీవనం వారు గడిపే సమయంలో రామ్ మరో అమ్మాయి మైథిలి(మాధురి)ని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవుతాడు. కానీ సరిగ్గా ఆమెకు తాళి కట్టే సమయంలోనే తన మాజీ భార్య మీరా తాను గర్భవతిని అంటూ ఎంట్రీ ఇస్తుంది. మరి ఈ సమాయన్ని రామ్ ఎలా హ్యాండిల్ చేసాడు? ఆ తర్వాత ఏమయ్యింది అన్నదే అసలు కథ.

ఏమి బాగుంది?

మొదటగా కోలీవుడ్ నటుడు జై విషయానికి వస్తే అతడు ఇప్పటికే పలు సినిమాలతో మన తెలుగు ఆడియెన్స్ కు కూడా పరిచయమే. సినిమాల్లో ఎంత సెటిల్డ్ అండ్ నీట్ గా నటించాడో ఈ సిరీస్ లో కూడా అవన్నీ కనిపిస్తాయి. అలాగే తన కామెడీ టైమింగ్ కూడా ఇందులో మరోసారి స్ట్రైక్ అవుతుంది. మరి ఇంకా అలానే ఈ సిరీస్ తన భుజాలపై మోసాడని కూడా చెప్పొచ్చు.అలాగే ఫస్ట్ లీడ్ లో కనిపించే మాధురి తన రోల్ కు సరైన న్యాయం చేకూర్చింది.

ఇక అలాగే వాణి విషయానికి వస్తే ఆమె రోల్ కానీ డిజైన్ చేసిన విధానం కానీ బాగా అనిపిస్తాయి. అందుకు తగ్గట్టుగానే ఆమె ఇందులో చక్కటి నటన కనబరిచింది. ఇక అలాగే వివేక్ ప్రసన్న మరియు రాజ్ కుమార్ ల మధ్య ఉండే ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనింగ్ ఎపిసోడ్స్ మంచి ఫన్ ను జెనరేట్ చేశారు. అలాగే ఈ సిరీస్ లో మంచి నిర్మాణ విలువలు చాలా బాగుంటాయి. అలాగే మొదటి రెండు ఎపిసోడ్స్ లో మంచి నరేషన్ కనిపిస్తుంది.

ఏమి బాలేదు?

ఇక ఈ సిరీస్ లోని డ్రా బ్యాక్స్ కు వస్తే అవి కూడా చాలానే ఉన్నాయని చెప్పాలి. ముఖ్యంగా ఈ సిరీస్ లో ఉన్న కంటెంట్ కు అయితే ఇన్ని ఎపిసోడ్స్ అవసరమే లేదు అనిపిస్తుంది. అలాగే స్క్రిప్ట్ ను రాసుకున్న విధానం కూడా అంత బాలేదు.ముఖ్యంగా రామ్ మరియు మీరాలు విడిపోవడం వారి మధ్య రొమాంటిక్ ఎపిసోడ్స్ కూడా పెద్దగా బాగుండవు.

అంతే కాకుండా ఈ ట్రై యాంగిల్ స్టోరీలను చాలానే చూసేసాము సో అంత కొత్తగా కూడా అనిపించదు. అలాగే ఈ సిరీస్ లో కామెడీ కూడా పెద్దగా వర్కౌట్ అయ్యినట్టు అనిపించదు. సార్టింగ్ లో అవి అన్ని బాగానే ఉన్నా తర్వాత తర్వాత వాటి వల్లే సిరీస్ పక్కదారి పట్టినట్టు అనిపిస్తుంది.

పైగా మరింత సాగదీసినట్టు కూడా అనిపిస్తుంది. ఇంకా అలాగే ప్రధాన పాత్రధారుల్లో సరైన ఎమోషన్స్ ను కూడా పండినట్టు అనిపించదు. వీటికి తోడు ఎడిటింగ్ వర్క్ కూడా చాలా డల్ గా అనిపిస్తుంది. వాటి వల్ల ఈ సిరీస్ మరింత స్లోగా ఉన్నట్టు అనిపిస్తది.

తీర్పు :

ఇక ఫైనల్ గా చూసుకుంటే ఈ “ట్రిపుల్స్” సిరీస్ ను ఒక రొటీన్ ఫ్యామిలీ డ్రామా అని చెప్పొచ్చు. మంచి కామెడీ సీక్వెన్స్ లు మరియు ఇంప్రెసివ్ స్టార్టింగ్ తో మొదలైనా సరైన రచన అనవసరంగా ఎక్కువగా సాగదీయడం వంటివి ఏమంత ఆసక్తికరంగా అనిపించవు. కానీ కథ, కథనం లాంటివి పక్కన పెట్టి మంచి కామెడీ కావాలి అనుకుంటే ఈ సిరీస్ ను ఓ లుక్కెయ్యొచ్చు.

123telugu.com Rating : 2.5/5
Reviewed by 123telugu Team

సంబంధిత సమాచారం

తాజా వార్తలు