“కేజీయఫ్ 2”, “బీస్ట్” లలో మొదట ఓటిటి బ్లాస్ట్ ఈ సినిమానే అట.!

Published on Apr 20, 2022 3:02 am IST

లేటెస్ట్ గా ఒక్క రోజు గ్యాప్ లో ఇండియన్ బాక్సాఫీస్ దగ్గరకి రిలీజ్ అయ్యిన చిత్రాలు “కేజీయఫ్ చాప్టర్ 2” మరియు “బీస్ట్” సినిమాలు కోసం తెలిసిందే. కన్నడ మరియు తమిళ్ నుంచి వచ్చిన ఈ సినిమాల్లో యష్ మరియు విజయ్ లు హీరోలుగా నటించగా భారీ ఓపెనింగ్స్ నే ఈ చిత్రాలు అందుకున్నాయి.

అయితే విజయ్ సినిమాకి టాక్ కొంచెం తేడాగా రాగా కేజీఎఫ్ 2 మాత్రం బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతుంది. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ రెండు సినిమాల ఓటిటి రిలీజ్ లపై లేటెస్ట్ బజ్ తెలుస్తుంది. దీని ప్రకారం బీస్ట్ కాస్త ముందుగానే చెప్పిన విధంగా మే 11 నుంచే నెట్ ఫ్లిక్స్, సన్ నెక్స్ట్ లలో స్ట్రీమింగ్ కి వచ్చేయనుండగా..

కేజీయఫ్ 2 హిట్ తో గతంలో లానే కాస్త లేట్ స్ట్రీమింగ్ కే ప్రైమ్ వీడియో వారు తీసుకొస్తారట. అప్పట్లో ఎలా అయితే ఊరించారో ఈసారి అంతకు మించే ప్రమోషన్స్ సస్పెన్స్ లతో మరో రెండు నెలల్లో చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :