ఎన్టీఆర్ “ఎవరు మీలో కోటీశ్వరులు” కి డేట్ ఫిక్స్..!

Published on Aug 14, 2021 1:53 pm IST

జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాత గా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమం ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ఒక బుల్లితెర ప్రేక్షకుల తో పాటుగా, ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. జెమిని టీవీ లో ప్రసారం కానున్న ఈ కార్యక్రమం కి సంబంధించిన మరొక ప్రోమో ను యాజమాన్యం విడుదల చేయడం జరిగింది.

ఆగస్ట్ 22 వ తేదీన ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. రక్షా బంధన్ రోజున కార్యక్రమం మొదలు కానుండగా, 23 వ తేదీ నుండి అసలు ఆట షురూ కానుంది. సోమవారం నుండి గురువారం వరకూ రాత్రి 8:30 గంటలకు ప్రసారం కానుంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తో మొదటి షో చేయనున్నారు. డేట్ ఫిక్స్ చేస్తూ విడుదల అయిన ప్రోమో తో ఈ కార్యక్రమం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :