“బిగ్ బాస్ తెలుగు 5” పై ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇవే.!

Published on Aug 29, 2021 4:50 pm IST

ఈరోజు కింగ్ నాగార్జున బర్త్ డే సందర్భంగా సినిమా వర్గాలతో పాటుగా బుల్లితెర వీక్షకులు వర్గాలు కూడా తెలుపుతున్నాయి. అయితే మన తెలుగులో బిగ్గెస్ట్ గ్రాండ్ రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ ని గత రెండు సీజన్లలో తనదైన మార్క్ హోస్టింగ్ తో రక్తి కట్టించిన నాగ్ కి ఈరోజు స్టార్ మా వారు స్పెషల్ పోస్టర్ తో విషెష్ తెలియజేసారు. మరి ఇదిలా ఉండగా ఇంకొన్ని రోజుల్లో స్టార్ట్ కానున్న ఈ షో పై లేటెస్ట్ అప్డేట్స్ తెలుస్తున్నాయి.

ప్రస్తుతం అయితే సీజన్ 5 కంటెస్టెంట్స్ అందరు హైదరాబాద్ పార్క్ హయత్ లో క్వారంటైన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే మరో ఆసక్తికర అప్డేట్ ఏమిటంటే ఆల్రెడీ సెలెక్ట్ అయ్యిన పలువురు కంటెస్టెంట్స్ తమ సోషల్ మీడియా టీం వర్క్ ని కూడా స్టార్ట్ చేసేస్తున్నారు. ఇలా మొత్తానికి మాత్రం ఆల్రెడీ హంగామా మొదలయ్యిపోతుంది. ఇక నుంచి ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :