బుల్లితెర పై “వకీల్ సాబ్” అదరగొట్టేనా?

Published on Jul 13, 2021 4:41 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ న్యాయవాది గా నటించిన వకీల్ సాబ్ చిత్రం థియేటర్ల లో విడుదల అయి కలెక్షన్ల సునామి సృష్టించింది. పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ కు భారీ గా వసూళ్లు రావడం మాత్రమే కాకుండా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే అమెజాన్ ప్రైమ్ విడియో లో ఈ చిత్రం ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ చిత్రం బుల్లితెర పై వరల్డ్ ప్రీమియర్ గా టెలికాస్ట్ కానుంది. జీ తెలుగు లో ఈ చిత్రం జూలై 18 న ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు ఈ చిత్రం వస్తుండటం తో అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

అయితే గతం లో బుల్లితెర పై పవన్ కళ్యాణ్ సినిమా గబ్బర్ సింగ్ రికార్డ్ స్థాయిలో టీఆర్పీ రేటింగ్ సొంతం చేసుకుంది. అయితే ఈ సారి ఈ కమ్ బ్యాక్ చిత్రానికి అంతకుమించి టీఆర్పీ వస్తుంది అంటూ కొందరు అంటున్నారు. అయితే జీ తెలుగు లో రానున్న ఈ చిత్రం కి ఏ స్థాయిలో రేటింగ్ వస్తుందో చూడాలి. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ చిత్రం లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా, నివేథా థామస్, అంజలి, అనన్య నాగళ్ళ లు కీలక పాత్రల్లో నటించారు. ప్రకాష్ రాజ్ పాత్ర సైతం ఈ చిత్రం లో ముఖ్య భూమిక పోషించింది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :