2 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకున్న “ఓయ్ ఇడియట్” ట్రైలర్!

Published on Jul 17, 2021 12:14 am IST

వెంకట్ కడలి దర్శకత్వం లో యశ్వంత్ యజ్జవరపు మరియు తృప్తి శంకధర్ లు హీరో హీరోయిన్ లు గా నటించిన తాజా చిత్రం ఓయ్ ఇడియట్. ఈ చిత్రం కి సంబంధించిన పాటలు, ట్రైలర్ విడుదల అయి ప్రేక్షకులని విశేషం గా ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ చిత్రం ట్రైలర్ విడుదల అయి ఒక్క రోజుకే 2 మిలియన్ ప్లస్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. అయితే సహస్ర మూవీస్ మరియు హ్యాపీ లివింగ్ ఎన్విరాన్ మెంట్ పథకాల పై ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం జికేవి అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :