అమెజాన్ ప్రైమ్ లోకి “పాగల్”.. తేది ఫిక్స్..!

Published on Sep 1, 2021 12:22 am IST

మాస్ కా దాస్ విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్ ప్రధాన పాత్రల్లో నరేష్ కుప్పిలి దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం ‘పాగల్’. దిల్ రాజు సమర్పణలో బెక్కెమ్ వేణుగోపాల్ లక్కీ మీడియా పతాకంపై మంచి అంచనాల మధ్య ఆగస్ట్ 14న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

అయితే ఈ సినిమా డిజిటల్ హ‌క్కుల‌ను ప్ర‌ముఖ ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియో ద‌క్కించుకున్నట్టు తెలుస్తుంది. సెప్టెంబ‌ర్ 3నుంచి అమెజాన్ ప్రైమ్ లోకి ఈ సినిమా అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించి అమెజాన్ త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న విడుదల చేయనుంది. ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం “గామి” అనే సినిమాలో విశ్వక్ సేన్ నటిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :