విశేషంగా ఆకట్టుకుంటున్న పాగల్ ట్రైలర్!

Published on Aug 10, 2021 6:47 pm IST

నరేష్ కొప్పిలి దర్శకత్వం లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం పాగల్. ఈ చిత్రం కి సంబంధించిన ట్రైలర్ నేడు విడుదల అయింది. ఈ చిత్రం ట్రైలర్ కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. విడుదల అయిన కొద్ది సేపటికే 1.5 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకొగా, 100కే లైక్స్ ను సాధించింది. ఈ చిత్రం ను ఆగస్ట్ 14 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ చిత్రం నుండి విడుదల అయిన పాటలు, పోస్టర్లు ఇప్పటికే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం లో సిమ్రాన్ చౌదరీ మరియు నివేథా పేతురాజ్ లు హీరోయిన్ లు గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం రదన్ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :