ఇంట్రెస్టింగ్..”ఫ్యామిలీ మ్యాన్ 3″ లో “పాతాళ లోక్” నటుడు.!

Published on Jun 10, 2021 3:00 pm IST

ప్రస్తుతం ఇండియన్ ఓటిటి వీక్షకులులో హాట్ టాపిక్ గా నిలిచిన మోస్ట్ అవైటెడ్ వెబ్ సిరీస్ “ది ఫ్యామిలీ మ్యాన్ 2” రాజ్ అండ్ డీకే కు తెరకెక్కించిన ఈ సిరీస్ ఇప్పుడు సూపర్ హిట్ అయ్యింది. స్టార్ హీరోయిన్ సమంతా మరియు మనోజ్ భాజ్ పై ల కాంబోలో వచ్చిన ఈ సిరీస్ యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది.

అయితే ఈ సీజన్ కూడా హిట్ కావడంతో మూడో సీజన్ కి కూడా రంగం సిద్ధం అయ్యింది. మరి ఇదిలా ఉండగా ఈ సిరీస్ పై మరో ఇంట్రెస్టింగ్ బజ్ బయటకి వచ్చింది. ఇదే సిరీస్ ను స్ట్రీమింగ్ కు తీసుకొచ్చిన ప్రైమ్ వీడియోలో సెన్సేషనల్ హిట్ కాబడిన మరిన్ని సిరీస్ లలో “పాతాళ లోక్” కూడా ఒకటి.

అయితే ఈ సిరీస్ లో ఇంటెన్స్ రోల్ హతీరాం చౌదరి పాత్రలో నటించిన జైడీప్ అహ్లావాత్ నటించనున్నాడని తెలుస్తుంది. అది కూడా మనోజ్ బాజ్ పై చేసే శ్రీకాంత్ రోల్ తో ట్రావెల్ అయ్యేదిలా ఉంటుందని తెలుస్తుంది.ఈ క్రాస్ ఓవర్ మాత్రం కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉంది. మరి ఎప్పుడు నిజమవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :