“బిగ్ బాస్ 5” పుకారుపై క్లారిటీ ఇచ్చిన పాయల్.!

Published on Jun 10, 2021 5:00 pm IST

తన మొదటి సినిమాతోనే టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హాట్ బ్యూటీ పాయల్ రాజ్ ఫుట్ ఇప్పుడు పలు ఆసక్తికర చిత్రాల్లో నటిస్తుంది. అయితే మరో పక్క మన తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ సీజన్ 5 పై కూడా అనేక రకాల గాసిప్స్ మొదలయ్యాయి. అయితే ఇంతటి స్టార్ స్టేటస్ ఉన్న పాయల్ తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 లో ఉందని వార్తలు గుప్పుమన్నట్టున్నాయి.

ఫైనల్ గా ఆ రూమర్ కు చెక్ చెప్తూ పాయల్ క్లారిటీ ఇచ్చింది. “నేను తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 లో లేనని అదంతా ఒట్టి ఫేక్ న్యూస్ మాత్రమే అని దయచేసి ఇలాంటి రూమర్ వార్తల్లోకి నన్ను లాగొద్దని వేడుకుంటున్నాని” పాయల్ తెలిపింది. సో పాయల్ పై అలాంటి వార్తలు స్ప్రెడ్ చేసిన వారికి తాను గట్టి రిప్లై ఇచ్చింది అని చెప్పాలి. ప్రస్తుతం అయితే పాయల్ ఓ తమిళ్ హారర్ థ్రిల్లర్ సినిమా చేస్తూ బిజీగా ఉంది.

సంబంధిత సమాచారం :