‘పడి పడి లేచె మనసు’ విడుదల తేదీ ఖారారు అయింది !

Published on Jul 25, 2018 10:33 am IST

హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా రాబోతున్న చిత్రం ‘పడి పడి లేచె మనసు’. ఎప్పుడో పిబ్రవరి 5న షూటింగ్ మొదలైనప్పటికి, అనుకున్న షెడ్యుల్ ప్రకారం షూట్ పూర్తి చేసుకోలేకపోయిన ఈ చిత్రం ఎట్టకేలకు రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. డిసెంబర్ 21వ తేదిన వరల్డ్ వైజ్ గా గ్రాండ్ గా ఈ చిత్రం విడుదల కానుంది.

కాగా ఈ సినిమా అవుట్ ఫుట్ బాగా వచ్చిందని, ముఖ్యంగా శర్వానంద్, సాయి పల్లవి మధ్య లవ్ ట్రాక్, వారి పాత్రల మధ్య సాగే కొన్ని సన్నివేశాలు సినిమాకే హైలెట్ గా నిలుస్తాయట. ఇక సాయి పల్లవి ఈ చిత్రంలో ఫుట్ బాల్ ప్లేయర్ గా నటిస్తోంది. ఐతే ఆమె క్యారెక్టర్ చాలా కొత్తగా ఇంతకుముందెప్పుడూ తెలుగు సినిమాల్లో రాని విధంగా ఉంటుందని ప్రత్యేకించి క్లైమాక్స్ లో సాయి పల్లవి నటన అద్భుతంగా ఉండనందని సమాచారం. అలాగే క్లైమాక్స్‌ లో వచ్చే భూకంపం సన్నివేశాలకి సంబంధించి విజువ‌ల్ ఎఫెక్ట్స్‌, గ్రాఫిక్స్‌ సినిమాని మరోస్థాయికి తీసుకువెళ్తాయట.

సంబంధిత సమాచారం :