5గురు స్టార్ హీరోలు లాంచ్ చేయనున్న సినిమా పోస్టర్ !

Published on Jun 3, 2019 8:51 pm IST

‘కె.జి.ఎఫ్’ సినిమాతో కన్నడ సినిమాలకు దేశవ్యాప్తంగా క్రేజ్ పెరిగింది. అందుకే అక్కడి స్టార్ హీరోలు భారీ బడ్జెట్ పెట్టి నిర్మించే తమ సినిమాల్ని ఇతర భాషల్లోకి కూడా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. వారిలో స్టార్ హీరో కిచ్చ సుదీప్ కూడా ఉన్నారు. ఆయన నటించిన కొత్త చిత్రం ‘పహిల్వాన్’. ఈ సినిమాపై కన్నడనాట భారీ అంచనాలున్నాయి.

ఈ చిత్రాన్ని కన్నడలో పాటు తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో కూడా విడుదలచేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అందుకోసమే ముందుగా ఆయన భాషల్లో ప్రచారం కోసం రేపు సినిమాకు సంబందించిన కొత్త పోస్టర్‌ను స్టార్ హీరోలతో లాంచ్ చేయిస్తున్నారు. దాన్ని కన్నడలో సుదీప్ స్వయంగా విడుదలచేయనుండగా తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, మలయాళంలో మోహన్ లాల్, హిందీలో సునీల్ శెట్టి, తమిళంలో విజయ్ సేతుపతి రివీల్ చేయనున్నారు. ఈ తంతంగాన్ని చూస్తుంటే సినిమా భారీ ఎత్తున రిలీజవుతుందని స్పష్టంగా అర్థమవుతోంది. ఎస్.కృష్ణ డైరెక్షన్లో రూపొందిన ఈ చిత్రాన్ని ఆగష్టు నెలలో ప్రేక్షకులకు అందివ్వనున్నారు.

సంబంధిత సమాచారం :

More