లేటెస్ట్ : పవర్ఫుల్ గా ‘పక్కా కమర్షియల్’ పవర్ ప్యాక్డ్ ట్రైలర్

Published on Jun 29, 2022 8:00 pm IST

గోపీచంద్ లేటెస్ట్ మూవీ పక్కా కమర్షియల్ జులై 1న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకాభిమానుల ముందుకు రానుంది. మారుతీ తీసిన ఈ మూవీలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటించగా జేక్స్ బెజోయ్ మ్యూజిక్ అందించారు. యూవి క్రియేషన్స్, గీత ఆర్ట్స్ 2 బ్యానర్స్ కలిసి దీనిని నిర్మించాయి. ప్రారంభం నుండి ఆడియన్స్ లో మంచి క్యూరియాసిటీ ఏర్పరిచిన పక్కా కమర్షియల్ మూవీ ఇటీవల ట్రైలర్ రిలీజ్ తరువాత వాటిని మరింతగా పెంచేసింది. అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునేలా యాక్షన్, కమర్షియల్ అంశాలతో పాటు మంచి ఎంటర్టైన్మెంట్ అంశాలు కూడా జోడించి తెరకెక్కించిన ఈ మూవీ తప్పకుండా మంచి సక్సెస్ అందుకుంటుందని యూనిట్ అంటోంది.

ఇక ఈ మూవీ యొక్క పవర్ ప్యాక్డ్ ట్రైలర్ ని కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేసింది యూనిట్. తాను విలన్ గా నటించిన జయం, నిజం, వర్షం సినిమాల పేర్లు వచ్చేలా, అలానే నోట్లో పాన్ వేసుకుని షర్ట్ మడత పెట్టి దిగితే కటౌట్లు విరగాల్సిందే, ఫ్లెక్స్ లు చిరగాల్సిందే అంటూ ట్రైలర్ లో గోపీచంద్ పలికే డైలాగ్స్, స్టైల్, యాక్షన్ తో పాటు హీరోయిన్ రాశి ఖన్నా డైలాగ్స్, యాక్టింగ్ కూడా ఎంతో బాగున్నాయి. బిజీఎం, విజువల్స్, అదిరిపోవడంతో మొత్తంగా ఇది పక్కాగా పవర్ ప్యాక్డ్ ట్రైలర్ అనే చెప్పాలి. ఈ ట్రైలర్ తో సినిమా పై అంచనాలు మరింతగా పెంచేసిన పక్కా కమర్షియల్, రెండు రోజుల్లో రిలీజ్ తరువాత ఏ రేంజ్ సక్సెస్ కొడుతుందో చూడాలి.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :