డిజిటల్ ప్లాట్ ఫామ్ లో కూడా సూపర్ హిట్ !

డిజిటల్ ప్లాట్ ఫామ్ లో కూడా సూపర్ హిట్ !

Published on Apr 8, 2020 10:24 PM IST

ఈ మద్య కాలంలో కొత్త వారు సరికొత్త కాన్సెప్ట్‌ లతో చేస్తున్న సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన పలాస సినిమా కూడా మంచి అంచనాల మధ్య విడుదలై సక్సెస్ సాధించింది. కరుణ కుమార్‌ దర్శకుడిగా పరిచయం అయిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఆదరించారు. యదార్థ సంఘటనలకు కల్పిత సన్నివేశాలను జత చేసి తెరకెక్కిన ఈ సినిమాలో దాదాపు కొత్తవారు నటించారు.

కాగా తాజాగా ఈ సినిమా డిజిటల్ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలై మరింతమంది ప్రేక్షకులకు చేరువైంది. థియేటర్స్ లో మిస్ అయిన చాలా మంది ప్రేక్షకులు అమెజాన్ లో ఈ సినిమాను వీక్షించి ఫేస్ బుక్, ట్విట్టర్ లో పలాస సినిమా గురించి తమ భావాలను వ్యక్త పరుస్తున్నారు. రక్షిత్, నక్షత్ర, రఘు కుంచె, తిరువీర్, జనార్థన్, లక్ష్మణ్, తదితరులు నటించిన ఈ చిత్రాన్ని ధ్యాన్ అట్లూరి నిర్మించగా ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ సమర్పించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు