యదార్ద సంఘటనల ఆధారంగా రూపొందనున్న ‘పలాస 1978’

యదార్ద సంఘటనల ఆధారంగా రూపొందనున్న ‘పలాస 1978’

Published on Oct 29, 2018 2:01 PM IST

palasa
తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో కరుణ కుమార్ దర్శకత్వం లొ అప్పారావు బెల్లాన, అట్లూరి వరప్రసాద్రనిర్మిస్తున్న చిత్రం ‘పలాస 1978’ ఈ చిత్రానికి రఘు కుంచె సంగీతాన్ని, విన్సెంట్ అరుల్ సినిమాటోగ్రఫీ ని సమకూరుస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ యదార్ద సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరమీదకు తీసుకు వస్తున్నాము. పలు చిత్రాలకు రచన దర్శకత్వ విభాగంలో వర్క్ చేసిన కరుణ కుమార్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ప్రముఖ హీరొ తో పాటు వర్దమాన కథానాయకుడు ఈ చిత్రంలొ నటించనున్నారు.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం జనవరిలో చిత్రీకరణను జరుపుకోనుంది. ఇతర నటీనటులు, టెక్నిషియన్ల వివరాలను త్వరలొనే ప్రకటించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు