పవన్ కోసం అదిరే కథ ఉంది..శ్రీదేవి సోడా సెంటర్ దర్శకుడు

Published on Aug 29, 2021 8:44 am IST


ప్రస్తుతం టాలీవుడ్ లో రిలీజ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకున్న హిట్ చిత్రాల్లో రీసెంట్ రిలీజ్ “శ్రీదేవి సోడా సెంటర్” సినిమా కూడా ఒకటి. ఇంటెన్స్ ఫిల్మ్ మేకర్ కరుణ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం కూడా తన గత చిత్రం “పలాస 1975” లానే చాలా నాచురల్ గా ఉండడంతో ప్రతీ ఒకరు ఈ చిత్రానికి ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి ఇదిలా ఉండగా తన దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం ఒక అదిరే కథ ఉందని ఆయన చెప్తున్నాడు.

రీసెంట్ గా శ్రీదేవి సోడా సెంటర్ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ మాటలు ఆయన చెప్పడం జరిగింది. పవన్ కోసం అయితే తన దగ్గర ఒక కథ ఉందని అది కనుక పవన్ చేస్తే వేరే లెవెల్లో ఉంటుందని ఎగ్జైటెడ్ గా చెప్పారు. పవన్ ఇప్పటి వరకు చెయ్యని సబ్జెక్టు తన దగ్గర ఉందని ఒకవేళ చేస్తే అంతా పండుగ చేసుకునే రేంజ్ స్టోరీ ఉందని తెలిపారు.

ఒక్క టాలీవుడ్ లోనే కాకుండా ఇండియా మొత్తం చూసే కథ ఉందని కాన్ఫిడెన్స్ గా తెలియజేసారు. అలాగే దీనికి మరిన్ని మాటలు జోడిస్తూ ఇండియాలో అయితే జస్ట్ ఒక హీరో అలా నడిస్తే స్క్రీన్ పై ఒక్క రజినీ కాంత్ గారికి పవన్ కళ్యాణ్ కే ఒక స్టేచర్ ఉంటుంది కంప్లీట్ గా ఇది నా ఒపీనియన్ అని తెలిపారు.

వారికే ఎందుకు ఉంటుంది అంటే అది ఎవరు చెప్పలేరని తెలిపారు. మొత్తానికి మాత్రం పవన్ కోసం ఓ టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ దగ్గర ఓ అదిరే కథ ఉందని అర్ధం అయ్యింది. ఎలాగో పవన్ కూడా ఇప్పుడు సాలిడ్ లైనప్ ని సిద్ధం చేస్తున్నారు. మరి ఈ క్రమంలో కరుణ కుమార్ తో కూడా చేస్తారేమో చూడాలి.

సంబంధిత సమాచారం :