ఎనర్జిటిక్ హీరో రామ్ తాజా చిత్రం ‘పండగ చేస్కో’ ముహూర్తం షాట్ ఈరోజు చిత్రీకరించనున్నారు. ఫిలిం నగర్ దేవస్థానం లో ప్రారంభంకానున్న ఈ చిత్రానికి కొంత మంది సెలబ్రిటీలు హాజరు కానున్నారు.
గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని పరుచూరి ప్రసాద్ నిర్మించనున్నారు. గత యేడాది రవి తేజ కి ‘బలుపు’ లాంటి బంపర్ హిట్ అందించిన గోపీచంద్ మంచి కమర్షియల్ ఎంటర్టైనర్స్ తీస్తారని పేరు వుంది.
ఈ చిత్రం లో రామ్ ఒక ఎనర్జిటిక్ అవతారం లో కనపడనున్నాడు. థమన్ సంగీతం అందించనున్న ఈ చిత్ర బృందం ఇటివలే చెన్నై లో మ్యూజిక్ సిట్టింగ్స్ పూర్తి చేసుకుని తిరిగి హైదరాబాద్ చేరుకుంది.
