నేడు స్పెయిన్ వెళ్తున్న ‘పండగ చేస్కో’ టీం.

నేడు స్పెయిన్ వెళ్తున్న ‘పండగ చేస్కో’ టీం.

Published on Feb 27, 2015 2:05 PM IST

Pandaga-chesko
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో యంగ్ & ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘పండగ చేస్కో’. సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. నేడు చిత్ర బృందం కీలక సన్నివేశాలు మరియు పాటల చిత్రీకరణ కోసం స్పెయిన్, పోర్చుగల్ వెళ్తున్నారు. మార్చి 23 వరకు ఈ షెడ్యూల్ ఉంటుంది. దీనితో షూటింగ్ కంప్లీట్ అవుతుందని సమాచారం.

రామ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అమెరికా నుండి ఇండియా వచ్చిన స్టైలిష్ ఎన్నారై యువకుడి పాత్రలో రామ్ నటిస్తున్నారు. ఎస్.ఎస్.తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. సాంగ్స్ రికార్డింగ్ కంప్లీట్ అయ్యింది. త్వరలో ఆడియో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. యునైటెడ్ మూవీస్ పతాకంఫై పరుచూరి ప్రసాద్ సమర్పణలో పరుచూరి కిరీటి ‘పండగ చేస్కో’ను నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు