యాక్షన్ హీరో టీజర్ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించిన చిత్రబృందం !

Pandem kodi2
యాక్షన్ హీరో విశాల్ కి ‘పందెంకోడి’ చిత్రం ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ సినిమాతోనే ఆయన తెలుగు ప్రేక్షకులకి కూడా బాగా దగ్గరయ్యారు. కాగా ఆ చిత్రం వచ్చిన పన్నెండు సంవత్సరాలకి ఇప్పుడు సీక్వెల్‌గా ‘పందెం కోడి 2’ని తెరకెక్కిస్తున్నారు. కాగా తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ అండ్ టీజర్ విడుదల తేదీని చిత్రబృందం పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది

ఆగస్టు 29 న ఉదయం 11:00 గంటలకు ‘పందెం కోడి 2’ ఫస్ట్ లుక్ అండ్ టీజర్ విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో విశాల్ సరసన కీర్తీ సురేశ్‌ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మరో హీరోయిన్ వరలక్ష్మీ శరత్‌కుమార్‌ విశాల్ సరసన ఆడిపాడనుంది. లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్న ఈ సీక్వెల్‌ అక్టోబర్‌ 18న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇక తెలుగులో ఈ చిత్రాన్ని టాలీవుడ్ నిర్మాత టాగూర్ మధు విడుదల చేస్తున్నాడు

Exit mobile version