పంజా వైష్ణవ్ తేజ్ సరికొత్త చిత్రం టైటిల్ పై కీలక ప్రకటన!

Published on Jan 13, 2022 1:31 pm IST

ఉప్పెన, కొండపొలం చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులని విశేషం గా ఆకట్టుకున్న హీరో పంజా వైష్ణవ్ తేజ్. మెగా ఫ్యామిలీ సపోర్ట్ తో వచ్చిన ఈ హీరో తొలి చిత్రం తోనే ఎంతో క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. నేడు పంజా వైష్ణవ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా తన మూడవ చిత్రం కి సంబంధించిన ఒక కీలక అప్డేట్ ను చిత్ర యూనిట్ వెల్లడించడం జరిగింది.

పంజా వైష్ణవ్ తేజ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. #PVT3 చిత్రం టైటిల్ ను నేడు సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ఈ చిత్రానికి గిరిసాయా దర్శకత్వం వహించనున్నారు.

సంబంధిత సమాచారం :