అదుగో’ అక్కడ రీమేక్ అవుతుందా ?

Pannni Kutty
పందిపిల్లను హీరోగా పెట్టి విభిన్న చిత్రాల దర్శకుడు రవి బాబు చేసిన ప్రయోగం ‘అదుగో’. విడుదలకు ముందు హడావిడి చేసిన ఈ చిత్రం గత ఏడాది విడుదలై డిజాస్టర్ అయ్యింది. ఈసినిమా కోసం ఏకంగా రెండు సంవత్సరాలకు పైగా సమయం కేటాయించాడు దర్శకుడు రవిబాబు కానీ దారుణమైన ఫలితాన్ని చవిచూశాడు.

ఇక దాదాపుగా ఇదే కాన్సెప్ట్ తో ఇప్పుడు కోలీవుడ్ లో ఓ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా విడుదలైన ఈచిత్రం యొక్క పోస్టర్లను చూస్తుంటే అదుగో సినిమాను అక్కడ రీమేక్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది.

‘పన్నికుట్టి’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రముఖ కమెడియన్ యోగిబాబు , కరుణ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అను చరణ్ డైరక్ట్ చేస్తున్న ఈచిత్రాన్ని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది.

Exit mobile version