మెహ్రీన్ కు మరో అవకాశం వచ్చింది !

Published on May 2, 2019 9:01 am IST

ఈ ఏడాది ప్రారంభంలో ఎఫ్ 2 తో బ్లాక్ బ్లాస్టర్ హిట్ కొట్టిన పంజాబీ బ్యూటీ మెహ్రీన్ ఆ తరువాత ఒక్క ఆఫర్ ను కూడా రాబట్టుకోలేకపోయింది. ఈక్రమంలో మెహ్రీన్ టాలీవుడ్ గుడ్ బై చెపుతుందా అనే ఊహాగానాలు వెలుబడ్డాయి. అయితే తాజాగా వాటికీ చెక్ చెపుతూ మరో క్రేజీ ఆఫర్ ను సొంతం చేసుకుంది.

గోపిచంద్ – తిరు కాంబినేషన్ లో ఓ చిత్రం తెరకెక్కుతుందని తెలిసిందే. ఈ చిత్రంలో మెహ్రీన్ కథానాయికగా నటించనుంది. రీసెంట్ గా తిరు ,మెహ్రీన్ కలిసి స్టోరీ నరేట్ చేశాడు. తన పాత్ర నచ్చడంతో మెహ్రీన్ వెంటనే ఓకే చెప్పింది. ఇక గోపిచంద్ -మెహ్రీన్ జంటగా నటించడంఇది రెండవ సారి. ఇంతకుముందు వీరిద్దరూ పంతం లో కలిసి నటించారు.

యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటి జరీన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తుండగా ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకం ఫై అనిల్ సుంకర ఈచిత్రాన్ని నిర్మిస్తున్నాడు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :

More