సరి కొత్త ప్రేమకథతో ‘పేపర్ బాయ్’ వచ్చేస్తున్నాడు !

సరి కొత్త ప్రేమకథతో ‘పేపర్ బాయ్’ వచ్చేస్తున్నాడు !

Published on Aug 8, 2018 10:09 PM IST

Paper Boy
దర్శకుడు సంపత్ నంది నిర్మాణంలో తెరకెక్కతున్న తాజా చిత్రం ‘పేపర్ బాయ్’. నూతన నటీనటులతో రూపొందుతున్న ఈ చిత్రం పై మంచి అంచనాలే ఉన్నాయి. కాగా ఈ చిత్రం విడుదల తేదీని ఖారారు చేసుకుంది. ఈ చిత్ర నిర్మాత మరియు దర్శకుడు సంపత్ నంది తన ట్విట్టర్ ద్వారా సెప్టెంబర్ 7న పేపర్ బాయ్ విడుదల అవ్వనుందని అధికారికంగా ప్రకటించారు.

కాగా నూతన దర్శకుడు జయశంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కొత్త కథాంశంతో వస్తుందని తెలుస్తోంది. ముఖ్యంగా హీరో హీరోయిన్ల సంతోష్ శోభన్, రియా, తాన్య హోప్ మధ్య సాగే ప్రేమ సన్నివేశాలు చాలా కొత్తగా ఉంటాయని, పైగా ఈ ప్రేమ కథ మొత్తం కొత్త నేపథ్యంలో సాగుతుందని సమాచారం. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం సమకూరుస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు