మరణ వార్తలపై స్టార్ నటుడు ఎలా స్పందించారో చూడండి

Published on May 15, 2021 1:00 am IST

సినీ ప్రముఖులు కొన్నాళ్ళు బయట కనిపించకపోతే వారి మీద రకరకాల పుకార్లు పుట్టుకొస్తుంటాయి. వారు మరణించారనే రూమర్స్ సైతం వినిపిస్తాయి. తీరా అవి తెలిశాక తాము బాగానే ఉన్నామని క్లారిటీ ఇస్తుంటారు సదరు సినీ నటులు. కొందరు ఇలాంటి పుకార్ల మీద ఘాటుగా స్పందిస్తే ఇంకొందరు మాత్రం ఫన్నీగా రిప్లై ఇస్తుంటారు. తాజాగా సీనియర్ నటుడు పరేశ్ రావాల్ సైతం అలానే స్పందించారు. ఈరోజు ఉదయం నుండి పరేశ్ రావల్ మరణించారనే పుకార్లు సోషల్ మీడియాలో జోరుగా వినిపించాయి. ఈరోజు ఉదయం 7 గంటలకు ఆయన కన్నుమూశారని వార్తలు చక్కర్లుకొట్టాయి.

ఆ నోటా ఈ నోటా పడి అవి పరేశ్ రావల్ నోటీసుకు వెళ్లాయి. ఆయన వాటిని చాలా స్పోర్టివ్ గా తీసుకున్నారు. ఈరోజు ఉదయం 7 గంటలకు నేను నిద్రపోతున్నాను.. అపార్థం చేసుకున్నందుకు క్షమించాలి అంటూ స్పందించారు. పరేశ్ రావల్ రెస్పాండ్ అయిన తీరు చూసి పెద్దరికం అంటే ఇది కదా అంటూ మెచ్చుకుంటున్నారు నెటిజన్లు. ఇకపోతే పరేశ్ రావల్ ఇటీవల విడుదలైన ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాలో ప్రధాన ప్రతినాయకుడిగా నటించి మెప్పించారు.

సంబంధిత సమాచారం :