పార్క్ హయత్ లో మంచు మనోజ్ ఎంగేజ్ మెంట్

పార్క్ హయత్ లో మంచు మనోజ్ ఎంగేజ్ మెంట్

Published on Feb 25, 2015 7:37 PM IST

Manchu-Manoj
టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకరు మరియు మంచు ఫ్యామిలీ హీరోలలో చిన్నవాడు మన హీరో మంచు మనోజ్. ఇటీవలే మంచు మనోజ్ బ్యాచిలర్ లైఫ్ కి ఫుల్ స్టాప్ పెడుతూ ప్రణతితో పెళ్లి చేయడానికి మోహన్ బాబు కుటుంబ సభ్యులు నిర్ణయించారు. మంచు మనోజ్ – ప్రణతిల నిశ్చితార్ధం మార్చి 4న ఉదయం 10 గంటల 30 నిమిషాలకు జరగనుందని ఇదివరకే తెలియజేశాం. కానీ వేదిక ఎక్కడ అనేది అప్పటికి ఖరారు కాలేదు.

తాజా సమాచారం ప్రకారం మంచు మనోజ్ – ప్రణతిల నిశ్చితార్ధ వేడుకకి హైదరబాద్ బంజార హిల్స్ లోని పార్క్ హయత్ హోటల్ వేదికయ్యింది. మంచు విష్ణు సతీమణి విరానికా క్లాస్‌మేట్ ప్రణతితో మనోజ్ ప్రేమలో పడి, ఆ తర్వాత ఇరు ఫ్యామిలీ మెంబర్స్ ని ఒప్పించి పెళ్లి చేసుకుంటున్నారు. ఈ నిశ్చితార్ధ వేడుకకి ఇందాస్త్రీలోని ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ నాయకులు హాజరవుతున్నారు. మంచు మనోజ్ ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో ‘గొలుసు’ సినిమాలో నటిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు