ఇంటర్వ్యూ : పరుచూరి మురళి – ఆటగాళ్ళు మైండ్ గేమ్ తో సాగె సినిమా !

ఇంటర్వ్యూ : పరుచూరి మురళి – ఆటగాళ్ళు మైండ్ గేమ్ తో సాగె సినిమా !

Published on Aug 18, 2018 3:39 PM IST

నీ స్నేహం, ఆంధ్రుడు , పెదబాబు చిత్రాలతో హిట్లు కొట్టిన దర్శకుడు పరుచూరి మురళి చాలా రోజుల తరువాత ‘ఆటగాళ్ళు’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రం ఈనెల 24న విడుదలకానున్న సంధర్బంగా పరుచూరి మురళి మీడియా తో మాట్లాడారు ఆ విశేషాలు ఇప్పుడు మీకోసం…

ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది ?
పెదబాబు, ఆంధ్రుడు లాంటి విజయవంతమైన సినిమాలు తీసాక కూడా రెండు సంవత్సరాలు ఇంట్లో కూర్చున్న మంచి కథను తయారుచేసుకోవడానికి చాలా సమయం తీసుకుంటా అందుకే ఇంత లేట్ అయ్యింది.

మీ గోల్ ఏంటి ?
అందరి డైరెక్టర్స్ లాగా నాకు మంచి డైరెక్టర్ అనుపించుకోవాలనే ఉంటుంది. సినిమా ప్లాప్ అయితే వందేళ్ల ఆయిష్షు పోయినట్టుగా ఉంటుంది. చివరగా ఏం సినిమా తీశాడ్రా అని అనిపించుకోవాలని ఉంది .

ఆటగాళ్లు దేని గురించి ఉండనుంది ?
జగపతి బాబు, నారా రోహిత్ ఇద్దరు పర్సనల్ ప్రాబ్లమ్స్ ను ఎలా సాల్వ్ చేసుకున్నారనేదే ఈచిత్ర కథ. మైండ్ గేమ్ తో చాలా ఆసక్తికరంగా రొటీన్ కి బిన్నంగా సాగుతుంది ఈచిత్రం.

ఈ ఇద్దరి పాత్రల్లో ఎవరిది హైలెట్ అవుతుంది?
సినిమాలో ఇద్దరి పాత్రలు హైలెట్ గానే ఉంటాయి. ఒకరికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి మరొకరికి తక్కువగా ఆలా ఉండదు ఒక సన్నివేశంలో ఒకరు హైలెట్ అవుతారు మరొక దాంట్లో ఇంకొకరు అలా సాగుతుంది.

ఈ చిత్ర నిర్మాతల గురించి ?
ఈ చిత్ర నిర్మాతలు నా స్నేహితులే ఎప్పటినుండో మంచి సినిమా చేయాలనీ వాళ్లు ఎదురుచూస్తున్నారు .ఈ కథ వాళ్లకు చెప్పగానే నచ్చి ఈచిత్రం నిర్మించడానికి ముందుకొచ్చారు.

ఈ చిత్ర హీరోయిన్ గురించి ?
దర్శన బానిక్ హీరోయిన్ గా నటించింది. సమ్మె బెంగాలీ అమ్మాయి ఇంతకుముందు అక్కడ 6సినీమాల్లో నటించింది. దాంట్లో 5హిట్లు ఉన్నాయి. మా సినిమాకి కొత్త అమ్మయి అయితే బాగుంటుందని అనుకోని ఆడిషన్స్ చేసి ఆమె ను తీసుకోవటం జరిగింది. చాలా బాగా నటించింది.

బ్రహ్మనందం  ఈ చిత్రం మళ్లీ కమీడియన్ గా బిజీ అవుతారా ?
ఆ విషయం నేను చెప్పలేను. ఈచిత్రానికి ఒక సీనియర్ కమీడియన్ అయితే న్యాయం చేస్తాడని ఆయనను తీసుకోవడం జరిగింది. అయన పాత్ర ఫుల్ ఎంటర్టైన్ చేస్తుందని మాత్రం చెప్పగలను.

మీ తదుపరి చిత్రం గురించి ?
ప్రస్తుతానికైతే ఇంకేం అనుకోలేదు ఈ సినిమా రిజల్ట్ ను బట్టి తరువాత డిసైడ్ అవుతాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు